టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ.. అదే OpenAI వేస్తున్న భారీ స్కెచ్. ఇప్పటిదాకా మనం కేవలం ప్రశ్నలు అడగడానికి, కంటెంట్ రాయడానికి మాత్రమే ChatGPT(ChatGPT)ని వాడుతున్నాం. కానీ త్వరలో ఇది మీ మొబైల్‌లోని ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ (iOS) లాగే ఒక పూర్తిస్థాయి ఆపరేటింగ్ సిస్టమ్ (OS) గా మారబోతోంది. ఇది గనుక నిజమైతే, గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజాలకు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ లక్ష్యం కోసం ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ.. గ్లెన్ కోట్స్ (Glen Coates) అనే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను ‘హెడ్ ఆఫ్ యాప్ ప్లాట్‌ఫారమ్’గా నియమించింది.
Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

‘AI OS’ అంటే ఎలా ఉంటుంది?
ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి OpenAI ఇటీవల గ్లెన్ కోట్స్ (Glen Coates) అనే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను ‘హెడ్ ఆఫ్ యాప్ ప్లాట్‌ఫారమ్’గా నియమించింది. గతంలో షాపిఫై (Shopify) లో కీలక బాధ్యతలు నిర్వహించిన గ్లెన్, ChatGPTని కేవలం ఒక చాట్‌బాట్‌గా కాకుండా, ఒక ‘AI-Powered OS’గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. సాధారణంగా మనం ఒక పని చేయాలంటే వేర్వేరు యాప్స్ ఓపెన్ చేస్తాం. ఉదాహరణకు, మెయిల్ రాయాలంటే జిమెయిల్, ఫోటో ఎడిట్ చేయాలంటే కాన్వా (Canva) ఓపెన్ చేస్తాం. కానీ ChatGPT ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇవేవీ అవసరం లేదు. ఈ ఓఎస్ ఎలా ఉంటుందంటే.. ఆల్-ఇన్-వన్ ఇంటర్‌ఫేస్: రాయడం, కోడింగ్ చేయడం, షాపింగ్ చేయడం వంటివన్నీ ChatGPT నుండే నేరుగా చేసేయవచ్చు.
విడిగా ఆ యాప్స్ డౌన్లోడ్
యాప్ ఇంటిగ్రేషన్: ఇప్పటికే అడోబ్, కాన్వా, జిల్లా (Zillow) వంటి పెద్ద కంపెనీలు ChatGPT తో జతకట్టాయి. అంటే మీరు విడిగా ఆ యాప్స్ డౌన్లోడ్ చేయకుండానే చాట్ చేస్తూనే ఆ పనులన్నీ పూర్తి చేయవచ్చు. హార్డ్‌వేర్ కనెక్షన్: ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అది హార్డ్‌వేర్‌తో (ఫోన్ లేదా ల్యాప్‌టాప్) కలిసి పనిచేయాలి. దీనికోసమే OpenAI ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఆపిల్ మాజీ చీఫ్ డిజైనర్ జోనీ ఐవ్ (Jony Ive) తో కలిసి OpenAI ఒక కొత్త AI డివైజ్‌ను తయారు చేస్తోంది. ఇది 2027 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :