పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా (e-visa) మంజూరు చేయాలని నిర్ణయించింది. దేశంలోని 31 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 6 ఓడరేవుల్లో ఇంక్రెడిబుల్ ఇండియా కింద పర్యాటక వీసా (e-visa) లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) గురువారం రాజ్యసభకు తెలిపారు.
Read Also: Chhattisgarh: అంత్యక్రియల వివాదం..రెండు చర్చిలను తగలబెట్టారు

“స్వదేశ్ దర్శన్ 2.0” పథకం కింద 53 ప్రాజెక్టుల కోసం రూ. 2,208.27 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే, ‘ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్’ (CBDD) కార్యక్రమం కింద 36 ప్రాజెక్టులకు రూ. 648.11 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఈ నిధులను కేంద్రం విడుదల చేయగా, సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఏజెన్సీలు ప్రాజెక్టులను
అమలు చేస్తాయని తెలిపారు.పర్యాటక ప్రచారం కోసం ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ డిజిటల్ పోర్టల్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్ల కోసం అధిక నాణ్యత గల ఫోటోలు, వీడియోలు, బ్రోచర్లతో ‘ఇన్క్రెడిబుల్ ఇండియా కంటెంట్ హబ్’ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దీనితో పాటు సోషల్ మీడియా, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా కూడా భారత పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: