ఉమ్మడి గోదావరి(Godavari) జిల్లాల ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం కీలకంగా ముందుకు అడుగుపెడుతోంది. (D.CM Pawan) సుమారు రూ.3,050 కోట్లతో చేపట్టబోయే గోదావరి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. పెరవలి వద్ద జాతీయ రహదారి 216ఏ సమీపంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయినాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదు జిల్లాల్లోని సుమారు 67.82 లక్షల మందికి సురక్షితమైన తాగునీటిని అందించనున్నారు. ఈ బృహత్తర పథకంలో ధవళేశ్వరం, బొబ్బర్లంక, వేమగిరి వద్ద గోదావరి జలాలను సేకరించి, ఆధునిక సాంకేతికతతో శుద్ధి చేస్తారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు అమలు చేయనున్నారు. తొలి దశలో రూ.1,650 కోట్లతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 11 నియోజకవర్గాల్లో 39.64 లక్షల మందికి, రెండో దశలో రూ.1,400 కోట్లతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 నియోజకవర్గాల్లో 28.18 లక్షల మందికి తాగునీటిని అందిస్తారు. జల్ జీవన్ మిషన్ నిధుల ద్వారా రెండు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read also: CM Chandrababu: కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక వ్యాఖ్యలు

ప్రజల కోసం శాశ్వత పరిష్కారం
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ,((D.CM Pawan)) భూగర్భ జలాలు కలుషితం కావడం వల్ల ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా దీన్ని పరిష్కరిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించి, పైప్లైన్ల ద్వారా ఇంటింటికి శుద్ధమైన నీటిని సరఫరా చేస్తామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రజలు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఘనస్వాగతం పలకాలని మంత్రి పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: