ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్(Elon Musk) తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అకౌంట్స్ పేరుతో తీసుకువచ్చిన ఫెడరల్ పథకం పైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎలాన్ మస్క్ టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ భవిష్యత్తులో ప్రజలు డబ్బు ఆదా చేసుకోవలసిన అవసరమే ఉండదని, పేదరికం మాయమై అందరికీ అధిక ఆదాయం వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో యూనివర్సల్ హై ఇన్కమ్ అందుబాటులోకి వస్తుందని జోస్యం చెప్పారు. అమెరికాలో ప్రవేశపెట్టిన ట్రంప్ అకౌంట్స్ పథకంపైన ఇన్వెస్టర్ రే డాలియా డాలియో చేసిన వ్యాఖ్యల పైన స్పందిస్తూ మస్క్ ఈ విధంగా పేర్కొన్నారు.
Read Also: Satya Nadella: AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

డబ్బు ఆదా చెయ్యాల్సిన అవసరం రాదు రానున్న రోజుల్లో ఏ ఐ, రోబోటిక్స్ రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల పేదరికం పూర్తిగా తొలగిపోతుంది అన్నారు. డబ్బు ఆదా చేయాల్సిన అవసరం రాదని సాంప్రదాయ ఉద్యోగాల అవసరం కూడా తగ్గుతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఉత్పాదకత విపరీతంగా పెరిగితే గాలి మాదిరిగానే డబ్బు అసంబద్ధంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మస్క్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు అయితే ఎలాన్ మాస్క్ చేసిన వ్యాఖ్యల పైన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 600 బిలియన్ డాలర్లు సంపద కలిగిన వ్యక్తి ఇతరులకు డబ్బు దాచుకోవడం సలహా ఇవ్వడం విడ్డూరంగా ఉందని నెటిజన్లు మాస్క్ ను టార్గెట్ చేస్తున్నారు ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచ కుబేరుడు గా ఉన్న ఎలా నస్ ఎవరు డబ్బులు దాచుకోవద్దని చెప్పడం ఏమిటని ఆయన చేసిన వ్యాఖ్యలపై షాక్ అవుతున్నారు. ట్రంప్ అకౌంట్స్ పథకాన్ని టార్గెట్ చేస్తూ మస్క్ వ్యాఖ్యలు ఇదిలా ఉంటే ట్రంప్ ను టార్గెట్ చేస్తూనే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా పలువురు అంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: