వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడన్న అనుమానంతో భార్య అత్యంత దారుణానికి పాల్పడింది. తన అల్లుడితో కలిసి భర్తను హత్య(AndhraPradesh Crime) చేసిన ఘటన నంద్యాల జిల్లా శివారులోని నందమూరి నగర్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈ హత్యను కన్న కూతుళ్ల ముందే చేయడం సంచలనంగా మారింది.
Read Also: Sajjanar: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్

అల్లుడితో సన్నిహితంపై గొడవలు.. హత్యకు దారి
నంద్యాల(AndhraPradesh Crime) శివారులో నివసిస్తున్న గుర్రప్ప, సుభద్ర దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ గుర్రప్ప కుటుంబాన్ని పోషించేవాడు. పెద్ద కూతురు పౌర్ణమిని ఐదు నెలల క్రితం రుద్రవరం మండలం తూపల్లె గ్రామానికి చెందిన లింగమయ్యకు ఇచ్చి వివాహం చేశారు.
అయితే, అల్లుడు లింగమయ్యతో అత్త సుభద్ర అనవసరంగా సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన గుర్రప్ప తరచూ మందలించేవాడు. ఇదే వివాదం రోజురోజుకు ముదిరి చివరకు హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిద్రలోనే భర్తను చంపిన భార్య, అల్లుడు
ఈ నెల 17వ తేదీ రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన గుర్రప్ప నిద్రలోకి జారుకున్నాడు. ఇదే సరైన సమయమని భావించిన సుభద్ర, అల్లుడు లింగమయ్యకు సమాచారం ఇచ్చింది. ఇంటికి వచ్చిన లింగమయ్య స్పీకర్ వైర్లతో గుర్రప్ప మెడకు బిగించగా, సుభద్ర కాళ్లను తాడుతో బిగించి కదలకుండా చేసింది. ఈ క్రమంలో గుర్రప్ప ప్రాణాలు కోల్పోయాడు.
ఈ దారుణాన్ని గుర్రప్ప, సుభద్ర దంపతుల ఇద్దరు కూతుళ్లు ప్రత్యక్షంగా చూశారు. అడ్డుకునే ప్రయత్నం చేయగా, విషయం బయటకు చెబితే పెద్దక్కను కూడా చంపుతామని తల్లి, అల్లుడు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. భయంతో పిల్లలు మౌనంగా ఉండిపోయారు.
అనుమానాస్పద గాయాలు.. పోలీసులకు సమాచారం
హత్య అనంతరం ఇది సహజ మరణంగా చూపించేందుకు నిందితులు ప్రయత్నించారు. అయితే గుర్రప్ప మెడపై గాయాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి ఇది హత్యేనని నిర్ధారించారు.
పోలీసుల విచారణలో గుర్రప్ప కుమార్తెలు జరిగిన విషయాన్ని వివరంగా వెల్లడించారు. రాత్రి 11 గంటల సమయంలో తండ్రిని హత్య చేశారని, తండ్రి మృతదేహం పక్కనే కూర్చుని ఏం చేయాలో తెలియక భయంతో ఉండిపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సుభద్ర అదుపులోకి.. దర్యాప్తు కొనసాగింపు
గుర్రప్ప మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి సుభద్రను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడన్న కారణంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: