తిరుమలలో భక్తుల సందడి నిరంతరం కొనసాగుతోంది. (Tirumala)నిత్యం వేలాదిగా భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో నిండిపోయాయి. బుధవారం ఒక్కరోజే భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి హాజరుకావడం విశేషంగా నిలిచింది. బుధవారం నాడు మొత్తం 66,389 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, అందులో దాదాపు 24,956 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అదే రోజున హుండీ ఆదాయంగా రూ.3.81 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి లభించాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 27 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేకుండా వచ్చిన సర్వదర్శనం భక్తులకు దర్శనం పొందేందుకు సుమారు 10 నుంచి 12 గంటల వరకు వేచిచూడాల్సి వచ్చింది. ఈ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు క్యూలైన్లు మరియు కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేశారు.
Read Also: Pawan Kalyan: భూ మాఫియాపై చర్యలు తీసుకోవాలని బాబు కి పవన్ ఫిర్యాదు

తిరుమలలో పల్స్ పోలియో కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు
ఇదిలా ఉండగా, ఈ నెల 21వ తేదీన జరగనున్న దేశవ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. (Tirumala) ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం డిసెంబర్ 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.
అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, కల్యాణకట్ట, పాపవినాశనం, సుపథం, బాలాజీ నగర్, తిరుమల ఆలయం లోపల మరియు వెలుపలతో పాటు పలు ప్రాంతాల్లో పల్స్ పోలియో(Pulse Polio) కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముందు డిసెంబర్ 20న అవగాహన ర్యాలీతో పాటు జీపు ప్రకటనల ద్వారా భక్తులు, స్థానికులకు సమాచారం అందించనున్నారు. ఈ చర్యలు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: