Real Estate Scam: భూ మాఫియాపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్‌లో ప్రజల విలువైన భూములను అక్రమంగా ఆక్రమించిన ముఠాలు ఇప్పుడు విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, భూ కబ్జాలకు అండగా నిలుస్తున్న నేతలపైనా కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన కోరినట్లు సమాచారం.
Read also: AP Politics: PPP మోడల్‌పై జగన్ విమర్శలు, మంత్రి కౌంటర్
భూ కబ్జాదారులపై ఉక్కుపాదం
కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా ఉత్తరాంధ్రలో భూ మాఫియా పెరుగుతున్న తీరును పవన్ ప్రస్తావించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు గతంలో హైదరాబాద్‌లో రెచ్చిపోయిన భూ మాఫియా ముఠాలు ప్రస్తుతం విశాఖ ప్రాంతంలో పాగా వేసినట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

విశాఖ జోన్‌లో భూ కబ్జాల ఆరోపణలు: అధికారులకు సీఎం ఆదేశాలు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు, ఐటీ సంస్థలు పెద్దఎత్తున వస్తుండటంతో వేగంగా అభివృద్ధి జరుగుతోందని పవన్ వివరించారు. దీనివల్ల విశాఖపట్నం, విజయనగరం వంటి ప్రాంతాల్లో భూముల విలువ గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భూ మాఫియా అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తోందని, ప్రజలు తమ భూముల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
సీఎం–డిప్యూటీ సీఎం స్పష్టీకరణ
ఈ అంశంపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), భూ వివాదాల్లో ప్రభుత్వం, జనసేన, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోదని స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో భూ కబ్జాదారులపై మాత్రం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ ఫిర్యాదు వచ్చినా పాత రికార్డులను పరిశీలించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హామీ ఇచ్చారు.
భూ వివాదాల్లో రాజకీయ పార్టీలు, వ్యక్తులు లేదా ప్రొఫెషనల్ లిటిగెంట్స్ జోక్యం చేసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మళ్లీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఉత్తరాంధ్ర భూములపై కొందరు నేతలు కన్నేశారని ఆరోపించారు. విశాఖ జోన్‌లో భూ కబ్జా ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దీనిపై కఠిన ఆదేశాలు జారీ చేయాలని కోరగా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు తక్షణ చర్యల కోసం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: