2026 ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను జూన్ 11 నుంచి జులై 19 వరకు అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో సంయుక్తంగా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు సంబంధించిన ప్రైజ్ మనీని ఫిఫా (FIFA) భారీగా పెంచింది. గత టోర్నమెంట్‌తో పోలిస్తే ఏకంగా 50 శాతం అధికంగా, రికార్డు స్థాయిలో 727 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,500 కోట్లు) వెచ్చించనుంది. ఈ మేరకు బుధవారం జరిగిన సమావేశంలో ఫిఫా (FIFA) కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ నిధులలో సింహభాగం అంటే 655 మిలియన్ డాలర్లను టోర్నమెంట్‌లో పాల్గొనే 48 దేశాల ప్రదర్శన ఆధారంగా పంపిణీ చేయనున్నారు.
Read Also: Kapil Dev: గంభీర్ మేనేజర్ మాత్రమే: కపిల్ దేవ్
రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 33 మిలియన్ డాలర్లు
ఈ కొత్త నిబంధనల ప్రకారం వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టుకు 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 415 కోట్లు), రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 33 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 274 కోట్లు) అందనున్నాయి. గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించే 16 జట్లకు కూడా తలా 9 మిలియన్ డాలర్లు లభిస్తాయి.
వీటికి అదనంగా టోర్నీకి అర్హత సాధించిన ప్రతి దేశానికి సన్నాహక ఖర్చుల కింద 1.5 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ఫిఫా స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో మాట్లాడుతూ, “ఫిఫా వరల్డ్ కప్ 2026 అనేది ప్రపంచ ఫుట్‌బాల్ కమ్యూనిటీకి ఆర్థికంగా ఒక మైలురాయిగా నిలవనుంది” అని అన్నారు.
FIFA ఎప్పుడు ప్రారంభమైంది?
FIFA (Fédération International de Football Association)ను 1904 మే 21న స్థాపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: