తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ పై మరో సిట్ ఏర్పాటు అయింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Sajjanar) నేతృత్వంలో సీనియర్ ఐపీఎస్ అధికారులతో సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.సిట్ లో సభ్యులుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట సీపీ ఎస్.ఎం. విజయ్ కుమార్, డీసీపీలు రితిరాజ్, కె. నారాయణ రెడ్డి వంటి సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు.
Read Also: RBI Governor meeting : సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు
జూబ్లీహిల్స్ ఏసీపీ పి. వెంకటగిరి దర్యాప్తు అధికారిగా కొనసాగుతారు. కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, సాధ్యమైనంత త్వరగా చార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.ఇక ఇటీవల ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్ (SIT) ఎదుట లొంగిపోయిన మాజీ ఐపీఎస్అధికారి ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఆయనను పలు అంశాలపై అధికారులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా క్లౌడ్ పాస్ వర్డ్ లను ఎంటర్ చేసి ప్రభాకర్ రావు ఇచ్చారు. అందులోని కీలక ఆధారాలతో విచారిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: