ఆంధ్రప్రదేశ్ (AP) లోని పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక వెసులుబాటు కల్పించింది. (AP) పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపునకు శుక్రవారం, శనివారం మరో అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే గడువు ముగిసినప్పటికీ, ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Read Also: HAL Recruitment: హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఆపరేటర్ పోస్టుల భర్తీ

విద్యార్థులు రూ.500 ఫైన్‌తో హెడ్ మాస్టర్లు లాగిన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులు వయసు మినహాయింపు ఫీజును బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ (Board of Secondary Education website) లో చెల్లించాలన్నారు. ఒకేషనల్ విద్యార్థులు కూడా ఇదే సైట్లో ఫీజులు చెల్లించవచ్చని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: