Delhi blast case : ఢిల్లీ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ (NIA) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో అత్యంత ముఖ్యమైన నిందితుడిగా భావిస్తున్న యాసీర్ అహ్మద్ దార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మాహుతి బాంబర్‌గా మారిన ఉమర్ నబీని తీవ్రవాద మార్గంలోకి నెట్టిన ప్రధాన వ్యక్తి ఇతనేనని అధికారులు వెల్లడించారు.
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో, అది కూడా ఎర్రకోట వంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో జరిగిన బాంబ్ పేలుడు యావత్ దేశాన్ని కలవరపరిచింది. ఈ దాడి వెనుక అంతర్జాతీయ ఉగ్ర నెట్‌వర్క్ పనిచేసినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. 2022కు ముందే ఈ దాడికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించారని అధికారులు చెబుతున్నారు.
దర్యాప్తు ప్రకారం, ఉమర్ నబీ పాకిస్తాన్‌కు చెందిన (Delhi blast case) హ్యాండ్లర్ ఉకాషా ఆదేశాల మేరకు 2022లో టర్కీకి వెళ్లాడు. అక్కడ సిరియన్ ఉగ్రవాదులతో సమావేశమై, పెద్ద స్థాయి దాడులపై చర్చలు జరిపినట్టు వెల్లడైంది. టర్కీ నుంచి తిరిగిన తర్వాతే ఉమర్, ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో చేరినట్టు ఎన్ఐఏ గుర్తించింది.
Read Also: IND vs SA: నేడే 5వ T20
ఈ దాడి వెనుక రాడికలైజేషన్ మార్గాలు, విదేశీ హ్యాండ్లర్లు, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఉమర్ నబీతో పాటు డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ అదీల్, డాక్టర్ ముజఫర్ రాథర్ కూడా టర్కీకి వెళ్లినట్టు వెల్లడైంది. అక్కడ వారికి సిరియన్ హ్యాండ్లర్లు పెద్ద ఆపరేషన్‌లో పాల్గొనాలని ఆదేశించినట్టు తేలింది.
ఈ కేసులో తాజాగా అరెస్ట్ అయిన యాసీర్ అహ్మద్ దార్, ఉమర్ నబీకి ఆశ్రయం ఇచ్చినట్టే కాకుండా అతడిని ఆత్మాహుతి దాడికి ప్రేరేపించినట్టు అధికారులు చెబుతున్నారు. ఉమర్ నబీ తన దాడిని ‘బలిదానం’గా భావించే స్థాయికి తీసుకెళ్లడంలో యాసీర్ కీలక పాత్ర పోషించినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
2023 అక్టోబర్‌లో JM–అన్సార్ ఉల్ ఘజ్వత్–ఉల్ హింద్ మాడ్యూల్, ఇజ్రాయెల్‌లో హమాస్ తరహా దాడిని భారత్‌లో అమలు చేయాలని ప్లాన్ చేసినట్టు ఎన్ఐఏ తెలిపింది. డ్రోన్ దాడులు, కార్ బాంబులు, ఆత్మాహుతి దాడుల ద్వారా అనేక నగరాలను లక్ష్యంగా చేసుకునే కుట్ర సాగిందని వెల్లడించింది. ఈ మాడ్యూల్‌కు యాసీర్ అహ్మద్ దార్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: