ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సంస్థల యజమానులకు ఒక ప్రత్యేక అవకాశం అందిస్తోంది. ఈఈఎస్ (Employee Enrollment Scheme)–2025 పేరుతో కొత్త పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం, గతంలో వివిధ కారణాల వల్ల తమ ఉద్యోగులను ప్రొవిడెంట్ ఫండ్ (Provident fund) పరిధిలోకి చేర్చని సంస్థలకు వర్తిస్తుంది. యజమానులకు తమ అర్హత ఉన్న ఉద్యోగులను స్వచ్ఛందంగా పీఎఫ్ ఖాతాలో నమోదు చేసుకోవడానికి ఆరు నెలల గడువు ఇవ్వబడింది.
Read also: Smart Phones: వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్ఫోన్ల ధరలు?

పాత బకాయిలు సులభ చెల్లింపు కోసం ఈఈఎస్–2025 ప్రారంభం
ఈ పథకం 2025 నవంబర్ నుంచి ప్రారంభమై ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. 2017 జూలై 1 నుంచి 2025 అక్టోబర్ 31 మధ్యలో పీఎఫ్ పరిధిలోకి రాని ఉద్యోగులు ఈ పథకం కింద వస్తారు. పాత బకాయిలను సులభంగా చెల్లించుకునేందుకు ఈ స్కీం ఉపయోగపడుతుంది.
ఈ స్కీం కింద, ఉద్యోగి వాటాను జీతం నుంచి మినహాయించని పక్షంలో, యజమాని తన వాటా, వర్తించే వడ్డీ, పరిపాలనా చార్జీలతో పాటు నామమాత్రంగా ₹100 జరిమానా చెల్లించడమే సరిపోతుంది.
“అందరికీ సామాజిక భద్రత”
ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న సంస్థలు కూడా ఈ స్కీం ను ఉపయోగించవచ్చు. ఈ పథకం “అందరికీ సామాజిక భద్రత” అనే జాతీయ లక్ష్యాన్ని సాధించడానికి భాగంగా రూపొందించబడిందని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. యజమానుల్లో అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు, SMS, ఈ-మెయిల్ల ద్వారా సమాచారం అందించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: