ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో పర్యాటక రంగానికి ప్రభుత్వం భారీ ఊతం ఇస్తోంది. పర్యాటక రంగం గణనీయమైన వృద్ధిని సాధించనుంది. (AP)విశాఖపట్నంలో 50 ఎకరాల్లో వండర్‌లా థీమ్ పార్క్, తిరుపతిలో 20 ఎకరాల్లో ఇమాజికా వరల్డ్ పార్క్ ఏర్పాటు కానున్నాయి. ఇటీవల జరిగిన విశాఖ సమ్మిట్లో రూ. 28,977 కోట్ల పెట్టుబడులతో 209 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటిలో విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు ప్రాంతాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఇప్పటికే 27 ప్రాజెక్టులు ప్రారంభమై,
Read Also: AP tourism news : విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్.. ఏపీ ప్రభుత్వంతో కీలక ఒప్పందం…

పర్యాటక రంగం మరింత ఆకర్షణీయం
రూ. 5,820 కోట్ల పెట్టుబడితో 4,597 హోటల్ గదులు, 10,645 ప్రత్యక్ష, 18,030 పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి.విశాఖలో వండర్‌లా, తిరుపతిలో ఇమాజికా వంటి భారీ థీమ్ పార్కులు ఏర్పాటు కావడం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగం మరింత ఆకర్షణీయంగా మారనుంది. ఈ విధంగా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులు, కొత్త ఆకర్షణలు రాష్ట్రాన్ని ప్రముఖ టూరిస్ట్ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి కీలకంగా మారనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: