కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్ల కోసం ప్రపంచ సరఫరా గొలుసులను పొందే ప్రయత్నాలలో భారతదేశాన్ని(USA) కీలకమైన భాగస్వామిగా అమెరికా(America) పరిగణిస్తుందని అమెరికా అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాకబ్ హెల్బర్గ్ అన్నారు. ఇటీవల వాషింగ్టన్ శిఖరాగ్ర సమావేశంలో ఇండియా పాల్గొనకుండా రాజకీయ ఉద్రిక్తతలు అడ్డుపడ్డాయనే ఆరోపణలను ఆయన త్రోసిపుచ్చారు. ఫిబ్రవరిలో జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు తాను హాజరవుతానని జాకబ్ ప్రకటించారు. ఆర్థిక భద్రతావిషయాలపై న్యూఢిల్లీతో తమకు సహకారం మరింత అవసరమని అన్నారు.
Read also: Afghanistan: పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

సాంకేతిక అభివృద్ధికి తోర్పాటు
బుధవారం(USA) వాషింగ్టన్ లో జరిగిన పాక్స్ సిలికా సమ్మిట్ లో వర్చువల్ గా విలేకరులతో మాట్లాడుతూ, ఏఐ మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్ సరఫరా గొలుసులపై వ్యూహాన్ని సమన్వయం చేయడానికి సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను ఒకచోట చేర్చిన సమావేశంలో భారతదేశం లేకపోవడం గురించిన ప్రశ్నిలను హెల్బర్గ్ ప్రస్తావించారు. దౌత్యపరమైన ఘర్షణ కారణంగా భారతదేశం ఈ శిఖరాగ్ర సమావేశం నుండి తొలగించబడలేదని ఆయన నొక్కిచెప్పారు. భద్రతకు సంబంధిత ప్రయత్నాలలో భారతదేశాన్ని అత్యంత వ్యూహాత్మక సంభావ్య భాగస్వామిగా మేం భావిస్తున్నాం, వారితో నిమగ్నమయ్యే అవకాశాన్ని మేం స్వాగతిస్తున్నాం అని ఆయన అన్నారు. అంతేకాక రెండు దేశాల అధికారులు రోజువారీ కమ్యూనికేషన్ లో ఉంటారని జాకబ్ అన్నారు.
అమెరికా-భారత్ పరస్పర సహకారం
ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం వల్ల అమెరికా-భారత్ సహకారం కోసం ‘స్పష్టమైన మైలురాళ్లు’ స్థాపించడానికి అవకాశం లభిస్తుందని జాకబ్ హెల్బర్గ్ అన్నారు. ఈ సహకారాన్ని త్వరగా మరింతగా పెంచే మార్గాలను మేం చురుకుగా నిర్ణయిస్తున్నాం అని జాకబ్ అన్నారు. ఈ కార్యక్రమం ద్వైపాక్షిక ఆర్థిక భద్రతా ఏర్పాట్లలో గణనీయమైన పరిణామాలను ఇస్తుందని అన్నారు. డిసెంబర్ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా సాంప్రదాయ వాణిజ్య విధానాలకంటే జాతీయ భద్రతకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు జాకబ్ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: