శీతాకాల విడిది(Draupadi Murmu) కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. హకీంపేటలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ శిక్షణ కేంద్రానికి ఆమె ప్రత్యేక విమానంలో రాగా, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క తదితర ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ నెల 18న ఆమె అధికారిక నివాసంలో విశ్రాంతి తీసుకోనున్నారు.(Draupadi Murmu) 19వ తేదీన రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 20న గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్ సంస్థ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు.
21న నివాసంలో ఏర్పాటు చేసే పౌరుల భేటీతో పాటు’ఎట్ హోమ్’కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 22వ తేదీ సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి ప్రయాణం కానున్నారు.
Read also: TG: మొదలైన ఎన్నికల ఓట్ల లెక్కింపు

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: