ఆస్ట్రేలియా సిడ్నీలోని ప్రఖ్యాత బాండీ బీచ్ లో మూడురోజుల క్రితం జరిగిన కాల్పుల ఘటన తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి పర్యాటకులపై విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 16మంది మరణించిన విషయం విధితమే. ఈ ఘటనతో ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ (Donald trump) తాజాగా స్పందించారు. వైట్ హౌస్ లో హనుక్కా వేడుకలను ఆయన ప్రారంభించారు. రిపబ్లికన్లు ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. బొండీ బీచ్ కాల్పుల ఉదంతాన్ని ప్రస్తావించారు. ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు వ్యాఖ్యానించారు. ఇందులో 15మంది మరణించారని, 25 మంది గాయపడ్డారని, వారికి తన సంతానం, సానుభూతిని తెలియచేస్తున్నానని అన్నారు.
Read also: Venezuela blockade : వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

Australia
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం..
రాడికల్ ఇస్లామిజం వల్ల ప్రపంచానికి పెను ముప్పు ఉందని, దీనికి వ్యతిరేకంగా దేశాలన్నీ ఏకం కావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. యూదుల వ్యతిరేక ఉగ్రదాడి వల్ల ప్రభావితమైన ఆస్ట్రేలియన్లకు సంతాపం తెలియజేస్తున్నానని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ట్రంప్ అన్నారు. యూదులకు ఎప్పటికీ అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారు ట్రంప్. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం దుష్టశక్తులకు వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకతాటిపై నిలబడాలని ట్రంప్ పిలుపునిచ్చారు. నిజమే ప్రపంచానికి నేడు పెనుసవాలు ఉగ్రవాదం. ఉగ్రవాదం నుంచి తమ దేశప్రజలను కాపాడుకునేందుకు ప్రపంచదేశాలు మిలియన్ డాలర్లను ఖర్చుచేస్తున్నాయి. అయినా ఎక్కడో ఒకచోట ఉగ్రవాదులు దాడులు చేస్తూ, అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: