తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థులను ఆయన ప్రత్యక్షంగా కలుసుకుని అభినందించి సన్మానం చేయనున్నారు. ఇప్పటికే ఖానాపూర్, షాద్నగర్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో గెలుపొందిన అభ్యర్థులను కేటీఆర్ (kTR) కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అదే క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రజాప్రతినిధులతో కూడా సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు సమాచారం.
Read also: TG: మొదలైన ఎన్నికల ఓట్ల లెక్కింపు

BRS
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, గెలిచిన అభ్యర్థులను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం ఈ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామస్థాయిలో పార్టీ బలాన్ని మరింత పెంచే దిశగా ఈ పర్యటన కీలకంగా భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: