Peddi Song : చికిరి చికిరి 150M+ వ్యూస్‌తో రామ్ చరణ్ రికార్డుమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన స్టార్ పవర్‌ను నిరూపించారు. ఆయన నటిస్తున్న అప్‌కమింగ్ సినిమా ‘పెద్ది’ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ పాట సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులను దోచుకుంది.
విడుదలైన కేవలం నెల రోజుల్లోనే తెలుగు వెర్షన్ ఒక్కటే 100 మిలియన్ల వ్యూస్‌ను దాటడం విశేషం. మొత్తం ఐదు భాషల్లో కలిపి ఈ పాట 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. రోజురోజుకీ వ్యూస్‌తో పాటు పాటకు క్రేజ్ మరింత పెరుగుతోంది.
Read also: TG Panchayat Elections: మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం
సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అందించిన పవర్ఫుల్ మ్యూజిక్, ఎనర్జిటిక్ బీట్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక రామ్ చరణ్ అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్, స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. సోషల్ మీడియాలో ఈ పాటపై వేలాది రీల్స్, ఫ్యాన్ ఎడిట్స్ వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు బుచ్చిబాబు సానా చూపించిన స్టైలిష్ (Peddi Song) విజువల్స్, గ్రాండ్ స్కేల్ ప్రెజెంటేషన్ పాటకు మరింత బలం చేకూర్చాయి. ఈ భారీ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
‘చికిరి చికిరి’ సృష్టిస్తున్న సంచలనం కారణంగా ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ బజ్ ఆకాశాన్ని తాకుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: