శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల(Tirumala) తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొండపై వసతి కొరత కారణంగా భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేలా అలిపిరిలో మెగా టౌన్‌షిప్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
Read Also: Natural Remedies: ఆరోగ్యం కోసం కుంకుమ?

20 నుంచి 25 ఎకరాల్లో మెగా వసతి సముదాయం
తిరుమలలో(Tirumala) స్థలాభావం ఉండటంతో, కొండ దిగువన ఉన్న అలిపిరి ప్రాంతాన్ని బేస్‌క్యాంప్‌గా అభివృద్ధి చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న శిల్ప కళాశాలను ఇతర ప్రాంతానికి తరలించి, ఖాళీ అయ్యే సుమారు 20–25 ఎకరాల విస్తీర్ణంలో ఈ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నారు. ఇందులో ఒకేసారి 20 వేల మందికి పైగా భక్తులు బస చేసేలా ఆధునిక వసతి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
టికెట్లు, రవాణా, అన్నప్రసాదం.. అన్నీ ఒకేచోట
ఈ మెగా టౌన్‌షిప్‌లో గదులతో పాటు టికెట్ కౌంటర్లు, అన్నప్రసాద కేంద్రం, యాత్రికుల సముదాయం (PAC) వంటి కీలక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే భక్తులను తిరుమల కొండపైకి తరలించేందుకు టీటీడీ, ఏపీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా ప్రత్యేక రవాణా వ్యవస్థను రూపొందించనున్నారు.
విజన్–2047 ప్రకారం ప్రపంచ స్థాయి నిర్మాణం
టీటీడీ రూపొందిస్తున్న విజన్–2047 ప్రణాళికల్లో భాగంగా ఈ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నారు. ఇది సాధారణ వసతి సముదాయం కాకుండా, ప్రపంచ స్థాయి ఆర్కిటెక్ట్‌లతో డిజైన్ చేయించనున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఇక్కడ బస చేసి సౌకర్యవంతంగా స్వామివారి దర్శనానికి వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
వాహన కాలుష్యం తగ్గించడమే లక్ష్యం
ఈ బేస్‌క్యాంప్ అందుబాటులోకి వస్తే, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలను అలిపిరి వద్దే నిలిపివేసి, అక్కడి నుంచి భక్తులను పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా తిరుమలకు తరలిస్తారు. ఇందుకోసం మోడల్ ట్రాన్స్‌ఫర్ టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల కొండపై వాహన కాలుష్యం తగ్గడంతో పాటు నీరు, విద్యుత్ వినియోగాన్ని కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చని టీటీడీ భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: