
wildlife road accidents: అటవీ మార్గాల దగ్గరుగా ఉండే జాతీయ రహదారుల(NHAI)పై వన్యప్రాణుల ప్రమాదాలు తరచుగా జరగుతున్నాయి. జింకలు, ఎలుగుబంట్లు, పులులు, దప్పులు ఇలా అనూహ్యంగా రోడ్డు మీదకి వచ్చి వాహనాల కింద పడి ప్రాణాలు కోల్పోవడం లేదా తీవ్రంగా గాయపడటం సాధారణం. ఇప్పటికే వన్యప్రాణుల(Wildlife) రోడ్డు దాటే పాయింట్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, పెద్దగా ఉపయోగం పొందలేదు.
Read Also: AP RoadAccident: హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఈ సమస్యను పరిష్కరించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక వినూత్న పరిష్కారం చేపట్టింది. జాతీయ రహదారులపై ఎరుపు రంగులోని “టేబుల్ టాప్”లను ఏర్పాటు చేసింది. ఇవి సుమారు ఐదు మిల్లీమీటర్ల ఎత్తులో ఉండి, రోడ్డు ఉపరితలం నుండి కొద్దిగా ఎత్తైన విధంగా నిర్మించబడ్డాయి. వాహనాలు వీటిపై వెళ్తే తేలికపాటి కంపనం ఏర్పడుతుంది, దాంతో డ్రైవర్లు ఆటోమేటిక్‌గా వేగాన్ని తగ్గించుతారు.
అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు తగ్గించేందుకు టేబుల్‌టాప్ రోడ్లు
ఫలితంగా, వన్యప్రాణులు అనూహ్యంగా రోడ్డు దాటినపటికీ, డ్రైవర్లు సడన్ బ్రేకులు వేయడం, వేగాన్ని నియంత్రించడం సులభం అవుతుంది. జంతువులు సురక్షితంగా రోడ్డు దాటగలుగుతాయి, అదే సమయంలో డ్రైవర్లలో పరిసరాల పట్ల అవగాహన పెరుగుతుంది. ఈ విధానం మొదట మధ్యప్రదేశ్‌లో అమలులోకి వచ్చింది. జబల్‌పూర్-భోపాల్ జాతీయ రహదారులో 12 కిలోమీటర్ల వరకు టేబుల్ టాప్‌లను ఏర్పాటు చేశారు. వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్, నౌరాదేహి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల మధ్య గల రహదారులలో ఇది ఒక ప్రధాన మార్గం.
టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో హైవే భద్రతకు కొత్త మార్గం
ఇటువంటి ప్రాంతాల్లో జింకలు, నీల్గాయ్, నక్కలు వంటి జంతువులు రోడ్డు దాటే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. మొదటి దశలో NHAI ఈ మార్గంలోనే టేబుల్ టాప్ వ్యవస్థను అమలు చేసింది. వీటి తోపాటు NH 25 అండర్‌పాస్‌లను కూడా నిర్మిస్తోంది. ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకారం, భోపాల్-జబల్‌పూర్ మధ్య ఈ విధానం విజయవంతంగా ఉంటుంది. వన్యప్రాణుల రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయి. దీన్ని దేశవ్యాప్తంగా దశలవారీగా విస్తరించనున్నారు. ఏపీ, తెలంగాణలోనూ వ్యూహాత్మక అటవీ ప్రాంతాల ద్వారా వెళ్ళే జాతీయ రహదారులలో ఈ విధానం అమలు కానుంది, ఉదాహరణకు శ్రీశైలం టైగర్ రిజర్వ్, కవ్వల్ పులుల సంరక్షణ కేంద్రం వంటి ప్రాంతాలు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: