AP Government Jobs: కేంద్ర ప్రభుత్వం ఏపీ(AP) ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్, 1975లో మార్పులు చేసి రాష్ట్రంలోని 26 జిల్లాలను ఆరు జోన్లుగా, ఆ తర్వాత రెండు మల్టీ జోన్లు(Multi zones)గా విభజించడం జరిగింది. ఈ మార్పులు ప్రత్యక్ష నియామకాల్లో స్థానికత, జోనల్, మల్టీ జోనల్ సిస్టమ్ స్పష్టతను తీసుకొస్తాయి.
Read Also: AP RoadAccident: హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
కేంద్రం కొత్త గెజిట్ నోటిఫికేషన్ ద్వారా “ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్” సవరించింది. కొత్త మార్పుల ప్రకారం, ఉద్యోగ నియామకాలలో అభ్యర్థులు ఏడు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో చదివిన స్థలాన్ని స్థానికత అర్హతగా పరిగణించబడతారు.

రాష్ట్రంలోని ఆరు జోన్ల విభజన ఇలా ఉంది:
మల్టీ జోన్ 1:
- 1వ జోన్: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి
- 2వ జోన్: అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ
- 3వ జోన్: పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా
మల్టీ జోన్ 2:
- 4వ జోన్: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం
- 5వ జోన్: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప
- 6వ జోన్: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి
ఈ మార్పుల ప్రకారం, రాష్ట్ర స్థాయి కేడర్ విధానం ఇకపై ఉండకపోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ వరకు ఉద్యోగ అవకాశాలు జోనల్ స్థాయిలో కేటాయించబడతాయి. కొత్త విధానం స్థానికులకు ప్రాధాన్యతను పెంచి, నియామక ప్రక్రియను సులభతరం చేస్తుందని కేంద్రం తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: