అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ వీసాల కఠిన నిబంధనల వల్ల అమెరికాకు వెళ్లేందుకు భారతీయులు ఆసక్తి చూపించడం లేదు. విదేశీ చదువులు, ఉద్యోగాల కోసం ప్రయత్యామ్నయ దేశాలవైపు భారతీయులు చూస్తున్నారు. కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్ వంటి దేశాలకు చదువు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కెనడా ప్రభుత్వం గుడ్ న్యూస్ ను ప్రకటించింది. కెనడాలో స్థిరపడిన ప్రవాసులకు, ముఖ్యంగా భారతీయ సంతతికి కెనడా ప్రభుత్వం తీపి కబురు అందించింది. పౌరసత్వానికి సంబంధించి దశాబ్దాలుగా ఉన్న కఠిన నిబంధనలను సవరిస్తూ..మార్క్ కార్నీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా వెలుపల జన్మించిన కెనడియన్ల పిల్లలకు కూడా పౌరసత్వం కల్పించేలా చట్టంలో మార్పులు చేసింది. ఈ మేరకు బిల్ సి-17 (Bill C-17) ద్వారా తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఇటీవలే అధికారికంగా అమలులోకి వచ్చాయి. తాజా సవరణలతో భారీ ఊరట గతంలో ఉన్న మొదటి తరం పరిమితి నిబంధన ప్రకారం కెనడా బయట పుట్టిన కెనడియన్ల పిల్లలకు ఆటోమేటిక్ గా పౌరసత్వం లభించేది కాదు. తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా కెనడా గడ్డపై పుట్టి ఉంటేనే వారి పిల్లలకు పౌరసత్వం ఇచ్చేవారు.
Read also: Trump:వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

Bill C-17
ఫిజికల్ ప్రెజెన్స్’ నిరూపించుకుంటేనే
దీనివల్ల విదేశాల్లో ఉద్యోగాలు లేదా వ్యాపారాల రీత్యా నివసిస్తున్న వేలాదిమంది కెనడియన్ల పిల్లలు పౌరసత్వం కోల్పోయి ‘స్టేట్ లెస్’గా మిగిలిపోయారు. కానీ తాజా సవరణలతో ఆ అడ్డంకులు తొలగిపోయాయి. దీని ప్రకారం డిసెంబర్ 15వ తేదీ కంటే ముందు విదేశాల్లో జన్మించిన వారు లేదా పాత నిబంధనల వల్ల పౌరసత్వం పొందలేక పోయిన వారు ఇప్పుడు నేరుగా పౌరసత్వ రుజువు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అమల్లోకి కొత్త సంస్కరణలు డిసెంబరు 15వ తేదీ తర్వాత జన్మించే పిల్లల విషయానికొస్తే వారి తల్లిదండ్రులు ఆ శిశువు జననానికి ముందు కనీసం మూడేళ్లపాటు (1,095 రోజులు) కెనడాలో నివసించి ఉండాలి. ఈ ‘ఫిజికల్ ప్రెజెన్స్’ నిరూపించుకుంటేనే వారి పిల్లలకు కెనడా పౌరసత్వం లభిస్తుంది. నిజానికి ఈ మార్పు వెనుక ఆంటారియో సుపీరియర్ కోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఉంది. 2009 నాటి పాత నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని ఇవి కెనడియన్ల మధ్య వివక్ష చూపుతున్నాయని 2023లో కోర్టు స్పష్టం చేసింది. దీనిపై అప్పీలకు వెళ్లకుండా, చట్టాన్ని సవరించడమే సరైన మార్గమని భావించిన ప్రభుత్వం ఈ కొత్త సంస్కరణలను అమలులోకి తెచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: