తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండగ. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి పండకు ఉండే హడావుడే వేరు. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడినవారు సంక్రాంతి పండక్కి స్వగ్రామాలకు చేరుకుంటారు. చాలా మంది బస్సులు, ప్రవేటు వాహనాలతో పాటు ట్రైన్లలో ప్రయాణాలు సాగిస్తుంటారు. ఇప్పటికే ట్రైన్లలో అడ్వాన్స్ బుకింగ్లు పూర్తయ్యాయి.
Read Also: AP RoadAccident: హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మరో 16 ట్రైన్స్ అనౌన్స్
ఈ నేపథ్యంలో, స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఊరట కలిగించేలా దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో 16 ట్రైన్స్ (Special Trains) అనౌన్స్ చేసింది. సికింద్రాబాద్-శ్రీకాకుళం, వికారాబాద్-శ్రీకాకుళం, శ్రీకాకుళం-సికింద్రాబాద్ మార్గాల్లో ఈ రైళ్లు (Special Trains) నడవనున్నాయి. జనవరి 9 నుంచి 18 మధ్య ఈ ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: