ఉమ్మీద్ పోర్టల్ ఏర్పాటులో తలెత్తిన సాంకేతిక సమస్యలు
హైదరాబాద్ : తెలంగాణలో(Telangana) వక్స్ భూముల పరిరక్షణపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ స్పష్టం(Azharuddin) చేశారు. భూముల వివరాలను డిజిటలైజ్ చేసేందుకు ప్రత్యేకంగా ‘ఉమ్మీద్ పోర్టల్’ ఏర్పాటు చేస్తున్నామని, అయితే గత 10 రోజులుగా సాంకేతిక సమస్యలు తలెత్తాయని తెలిపారు. మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 63,180 ఎకరాలు వక్స్ ఆస్తులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 16,700 ఎకరాల వివ రాలను మాత్రమే పోర్టల్లో నమోదు చేశారని మంత్రి వెల్లడించారు. ఇంకా 46 వేల ఎకరాలకు పైగా భూముల వివరాలు నమోదు కావాల్సి ఉందన్నారు.తప్పుడు పత్రాలతో భూములను అప్లోడ్ చేస్తే వాటిని తిరస్కరిస్తామని హెచ్చరించారు. (Azharuddin) పోర్టల్లో సాంకేతిక సమస్యలు, యాప్ సరిగా పనిచేయకపోవడం వల్ల భూముల నమోదుకు మరింత సమయం ఇవ్వాలని కోరుతూ ప్రధాన మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వివరించారు. ఇటీవల గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఘటనలను మంత్రి దురదృష్టకరమని అభివర్ణిం చారు. ఈ ఘటనలపై విచారణకు ఆదేశించామని, నిరక్ష ్యంగా వ్యవహరించిన అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా. విద్యార్థులకు భోజనం అందించడానికి 30 నిమిషాల ముందే అధికారులు, సిబ్బంది పర్యవేక్షి చాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
Read also: Singareni: సింగరేణి ఇన్చార్జి సిఎండిగా ఐఎఎస్ కృష్ణభాస్కర్

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: