ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలం పాటలు ప్రతి సంవత్సరం కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు రూ. 15-16 కోట్లు అంటేనే గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడు రూ. 20 కోట్ల మార్క్ దాటడం సర్వసాధారణమైపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం..2025 మెగా వేలంలో రిషబ్ పంత్ రూ. 27 కోట్లతో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్(IPL) రూ. 26.75 కోట్లకు, కామెరూన్ గ్రీన్ రూ. 25.20 కోట్లకు అమ్ముడుపోయారు. 2024లో మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లకు, ప్యాట్ కమిన్స్ రూ. 20.50 కోట్లకు అమ్ముడుపోగా, వెంకటేష్ అయ్యర్ 2025లో రూ. 23.75 కోట్లకు కేకేఆర్ సొంతమయ్యాడు. గత మూడేళ్లుగా ముఖ్యంగా కోల్‌కతా(Kolkata) నైట్ రైడర్స్ భారీగా ఖర్చు చేస్తోంది.
Read also: Arup Biswas: బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: