Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ(Gaddam Vamsi) ఈ సమస్యపై అవగాహన పెంచేందుకు పార్లమెంటుకు ఎలక్ట్రిక్ బైక్‌లో హాజరయ్యారు. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ (AQI) గణనీయంగా పడిపోయి ప్రమాదకర స్థాయికి చేరిందని ఆయన పేర్కొన్నారు.
Read also: GRAP 4 curbs : ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

వాయు కాలుష్యం(Air pollution) భవిష్యత్ తరాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని, ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఆయన సూచించారు.
ఢిల్లీలో వాయు నాణ్యత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 493గా నమోదై, వందలాది విమానాల రద్దు కావాల్సి వచ్చింది. ఈ పరిస్థితి నగరంలో తీవ్ర ఆందోళన సృష్టిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: