గ్రీన్ కార్డ్ (Green card) ఇంటర్వ్యూలో భారత సంతతి మహిళకు విచిత్ర పరిస్థితి ఆమె అమెరికాలో దాదాపు 30ఏళ్లుగా నివసిస్తున్నారు. ఆమె వయసు 60ఏళ్లు భారత సంతతికి చెందిన మహిళ. తన గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి దశలో ఉండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్ మెంట్ కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.
Read Also: Trump: బీబీసీకి పరువునష్టం దావా కింద ట్రంప్ రూ.90వేల కోట్లు డిమాండ్

వెంటనే విడుదల చేయాలి
అరెస్టు అనంతరం బబ్లీజీత్ కౌర్ ను ఎక్కడికి తీసుకెళ్లారో చాలాగంటల వరకు కుటుంబ సభ్యులకు తెలియరాలేదు. ఆ తర్వాత, ఆమెను అడెలాంటోలోని ఐస్ డిటెన్షన్ సెంటర్ కు తరలించినట్లు సమాచారం అందింది. బబ్లీజీత్ కౌర్ కు అమెరికా (America) పౌరసత్వం ఉన్న కుమార్తె, గ్రీన్ కార్ ఉన్న భర్త ద్వారా ఆమోదించబడిన గ్రీన్ కార్డ్ పిటిషన్ ఉందని లాంగ్ బీచ్ వాచ్ డాగ్ తన కథనంలో పేర్కొంది. దీనిపై స్థానిక కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా, ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆమె బెయిల్ పై విడుదలయ్యేలా న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: