ఇటీవల విమాన ప్రమాదాలు (Plane Crash) తరచూగా చోటుచేసుకుంటున్నాయి. మొన్నటివరకు ఇండిగో విమానాల రద్దు, ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరుస ప్రమాదాలతో పలువురు మరణించడం తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు కూడా అధికం అవుతున్నాయి. ఇక రోడ్డు ప్రమాదాల గురించి లెక్కలు లేవు. తాజాగా విమాన ప్రమాదాలు సైతం జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం సర్వత్రా ఆవేదన నింపుతున్నాయి.
Read Also: Australia: దాడికి పాల్పడింది తండ్రీ కొడుకులే: తేల్చిన పోలీసులు
ఇప్పుడు లేటెస్ట్ గా మెక్సికోలో (mexico) ఘోరవిమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎమర్జన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఓ ప్రైవేట్ విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.

అత్యవసరంగా ల్యాండ్కు యత్నం..
పసిఫిక్ తీరంలోని ఆకాపుల్కో నుంచి ఇద్దరు సిబ్బంది, ఎనిమిదిమంది ప్రయాణికులతో ఓ విమానం బయల్దేరింది. పలు కారణాలతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దాంతో సమీపంలోని సాకర్ మైదానంలో విమానాన్ని ల్యాండ్చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అదుపు తప్పిన విమానం ఓ భవనం పైకప్పును బలంగా ఢీకొట్టింది.
దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
ఏడు మృతదేహాల గుర్తింపు తొలుకా ఎయిర్ పోర్ట్ కు సమీపంలోని శాన్ మాటియో అటెంకో అనే పారిశ్రామిక ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన చాలా గంటల తర్వాత కూడా ఏడు మృతదేహాలను మాత్రమే గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని మెక్సికో స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ కోఆర్డినేటర్ అడ్రిన్ హెర్నాండెజ్ అధికారికంగా ధ్రువీకరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: