हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Telugu News: Minister Savitha: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: హాస్టళ్లను తనిఖీ చేయాలి

Pooja
Telugu News: Minister Savitha: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: హాస్టళ్లను తనిఖీ చేయాలి

సచివాలయం : రాబోయే టెన్త్, ఇంటర్ పరీక్షల్లో వందశాతం ఫలి తాలు రాబట్టాలని, ఇందుకోసం ఇప్పటినుంచే విద్యా ర్థులను సమాయాత్తం చేయాలని రాష్ట్ర బిసి, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళీ శాఖ మంత్రి ఎస్.సవిత( Minister Savitha) ఆదేశించారు. ఫలితాలతోపాటు విద్యార్థుల ఆరోగ్యం, సంరక్షణ ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థుల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read also: Puli venkateshwarlu: అనుకున్నదొకటి.. అయ్యిందొకటి! కేవలం 10 ఓట్ల తేడాతో ఓటమి

Minister Savitha
Special focus on students’ health: Hostels must be inspected.

అమరావతిలోని రాష్ట్ర సచివాల యంలో ఎబిసిడబ్ల్యూ ఈవోలు, డిబిసిడబ్ల్యూ ఈవోలు, ఎంజేపీ కన్వీనర్లు, ప్రిన్సిపాళ్లతో రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, ఎంజేపి కార్యదర్శి మాధవీలతతో కలసి మంత్రి సవిత జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే టెన్త్, ఇంటర్ పరీక్షల నేపధ్యంలో జిల్లాల వారీగా ఆయాన హాస్టళ్లు, ఎంజేపి గురుకులాల్లో తీసుకుంటున్న చర్యలగురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థు లను గుర్తించి, వారిపై ప్రత్యేకశ్రద్ధ సారించాలన్నారు.
ప్రస్తుతం రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు తాజా,వేడి ఆహారం, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే ఇవ్వాలన్నారు విశ్రాంత, తరగతి గదుల్లో దోమలు చొరబడకుండా ద్వారాలు, కిటికీలదగ్గర దోమతెరలు వాడాల న్నారు. వార్డెన్లు హాస్టల్లో భోజనాన్ని ముందుగా రుచి చూడాలని, తర్వాత విద్యార్థులందరితో కలసి భోజనం చేయాలని మంత్రి స్పష్టంచేశారు. విద్యార్థుల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకంటామని మంత్రి హెచ్చరించారు.

హాస్టళ్లను తరచూ సందర్శించండి

ఏబిసిడబ్ల్యూఈవోలు, డిబిసిడబ్ల్యూ ఈవోలు, ఎంజేపి కన్వీనర్లు తరచూ తమ పరిధిలో ఉన్న హాస్టళ్లను, గురుకులాలను సందర్శించాలని మంత్రి సవిత(( Minister Savitha)) ఆదేశించారు. హాస్టళ్లను ఉన్నతాధికారులు తరచూ సందర్శిం చడం వల్ల వార్డెన్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తారన్నారు. వార్డెన్లు రాత్రుళ్లు హాస్టళ్ళలో ఉండేలా చర్యలు తీస్కోవాలని లేని వార్డన్లను ఉపేక్షించేంది లేదని విద్యార్థుల భద్రత ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. జూమ్ కాన్ఫరెన్స్లో బిసి సంక్షేమ శాఖాధికారులు, అన్ని జిల్లాల ఏబిసిడబ్ల్యూఈవోలు, డిబిసిడబ్ల్యూ ఈవోలు, ఎంజేపి కన్వీనర్లు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దీక్ష చేపట్టి ఆత్మార్పణం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన వదిలిన ఊపిరే తెలుగు వారి శ్వాస అని అన్నారు. అమరజీవి పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఎంతో ఆదర్శమని, ఆయన లక్ష్యసాధనకు అందరమూ కృషి చెద్దామిని మంత్రి సవిత పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870