జీహెచ్ఎంసీలోని (GHMC) డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ వినయ్ కుమార్ అనే వ్యక్తి తెలంగాణ (Telangana) హైకోర్టులో (High Court) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి (Vijay Sen Reddy) ఈ పిటిషన్ పై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్లపునర్విభజనలో అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు.
Read Also: TG: ధాన్యం కొనుగోలు రైతులకి నిధులు విడుదల..

జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ఈ పిటిషన్ పై విచారణ
డివిజన్ల పెంపు పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని కోరిన పిటిషనర్ తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. రాంనగర్ డివిజన్ పై తన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదని పిటిషనర్ అన్నారు. ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: