GOAT Tour India: గోట్ టూర్ ఇండియాలో భాగంగా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ(Lionel Messi) శనివారం కోల్‌కతా(Kolkata)లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం సమయంలో స్టేడియంలో ఉద్రిక్తతలు చోటుచేసుకోగా, సోమవారం పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. స్టేడియంలోని కుర్చీలను ధ్వంసం చేసి గందరగోళానికి కారణమైన శుభోప్రతిమ్, గౌరబ్ బసు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
Read also: Lionel Messi: ఒకే ఫ్రేమ్‌లో మెస్సీ, సచిన్

ఈవెంట్ నిర్వాహకుడికి 14 రోజుల పోలీస్ కస్టడీ
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి నివేదికను మరో 15 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా, అతనికి 14 రోజుల పోలీస్ కస్టడీని కోర్టు మంజూరు చేసింది. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: