
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తూ కేంద్ర ప్రభుత్వంతో కీలక చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని కలసి, విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (NSTI) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖకు NSTI గుడ్ న్యూస్..
విశాఖ జిల్లా పెదగంట్యాడ ప్రాంతంలో సుమారు 5 ఎకరాల భూమిని ఈ సంస్థ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించినట్లు లోకేశ్ వివరించారు. NSTI ఏర్పాటుతో అధ్యాపకుల శిక్షణ, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ మార్పు వంటి రంగాల్లో ఇది ప్రాంతీయ శిక్షణ కేంద్రంగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అంతేకాదు, రాష్ట్రంలో NCVET అర్హతలను విస్తృతంగా అమలు చేయడానికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
ఇంతకు ముందు పార్లమెంట్‌కు వచ్చిన నారా లోకేశ్(Nara Lokesh)కు పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో కూడా ఆయన భేటీ కానుండగా, విద్యా, ఐటీ శాఖలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఇతర ఎంపీలు కూడా పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: