తెలంగాణ రాష్ట్రం( TG Crime) మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం గ్రామంలో కట్న వేధింపులు దారుణ హత్యకు దారితీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం కోడలిని హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also: Sangareddy Crime: నమ్మినవాళ్లే ద్రోహం చేశారన్న బాధ.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

పోలీసుల వివరాల ప్రకారం.. స్వప్న, రామన్న దాదాపు 15 సంవత్సరాల క్రితం పెద్దల సమ్మతితో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో( TG Crime) స్వప్న కుటుంబం నుంచి రూ.3 లక్షల నగదు, 8 తులాల బంగారం ఇచ్చారు. ఆ తర్వాత కూడా మరోసారి ఒక ఎకరం పొలం కట్నంగా(Dowry) ఇచ్చినప్పటికీ వేధింపులు మాత్రం కొనసాగినట్టు తెలుస్తోంది.
తాజాగా స్వప్నను తీవ్రంగా హింసించి హత్య చేసిన నిందితులు, ఘటనను ఆత్మహత్యగా మలచేందుకు ప్రయత్నించి అక్కడి నుంచి పరారైనట్టు సమాచారం. విషయం బయటపడటంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కట్న వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: