అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆయనకు ఘన నివాళి అర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తున్నాను. మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ధీరోదాత్తుడు ఆయన.
Read Also: AP: మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు
ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ నిశ్చయంతో పోరాడి లక్ష్యం సాధించిన మహనీయుడు ఆయన. తన ప్రాణాలను కూడా లెక్కచేయని ఆయన త్యాగం మనలో స్ఫూర్తి నింపాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ప్రాణత్యాగంతో నాంది పలికిన ఆ మహనీయునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మరొక్కమారు నివాళి అర్పిస్తున్నాను.అని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ట్వీట్ చేశారు.
పొట్టి శ్రీరాములు ఏ ఉద్యమాల్లో పాల్గొన్నారు?
గాంధీ బాటలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని, భారత స్వాతంత్ర్య పోరాటంలో స్ఫూర్తిదాయక పాత్ర పోషించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: