Gold Rate Today : పసిడి ప్రేమికులకు చివరికి శుభవార్త అందింది. వరుసగా నాలుగు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర రూ.270 మేర పడిపోయింది. అలాగే జీవితకాల గరిష్ఠానికి చేరిన వెండి ధర కూడా ఒక్కరోజులో రూ.5,000 మేర తగ్గి కొనుగోలుదారులకు ఊరట ఇచ్చింది. డిసెంబర్ 14న హైదరాబాద్‌లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
భారతదేశంలో బంగారం ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఆభరణాల రూపంలో పసిడి ధరించడం సంప్రదాయమే కాకుండా, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. అయితే 2025లో బంగారం రేట్లు అసాధారణంగా పెరిగాయి. తులం ధర దాదాపు రెండింతలవగా, వెండి మాత్రం రూ.2 లక్షల మార్క్‌ను దాటింది. కానీ గత కొన్ని రోజుల రికార్డ్ పెరుగుదల తర్వాత ఈరోజు రెండింటి ధరలు కాస్త తగ్గాయి.
Read also: Amit Shah: నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి కీలక ప్రకటన
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 18.60 డాలర్ల మేర పెరిగి 4300 డాలర్ల స్థాయికి చేరుకుంది. మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు 3.55% పడిపోవడంతో 61.96 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్‌లో బంగారం ధర తగ్గుదల వరుస పెరుగుదల తర్వాత ఈరోజు 24 క్యారెట్ల శుద్ధ బంగారం ధర (Gold Rate Today) తులానికి రూ.270 తగ్గి 10 గ్రాములకు రూ.1,33,910గా నమోదైంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా రూ.250 తగ్గి తులం రూ.1,22,750కు చేరింది.
వెండి ధరలో భారీ తగ్గుదల: గత వారం రోజుల్లో రూ.19,000 పెరిగిన వెండి ధర ఈరోజు రూ.5,000 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,10,000 వద్ద ఉంది.
పైన తెలిపిన రేట్లు డిసెంబర్ 14 ఉదయం 7 గంటల సమయానికి సంబంధించినవి మాత్రమే. రోజులో మార్కెట్‌లో ధరలు మారే అవకాశం ఉండటంతో, కొనుగోలు చేసే ముందు స్థానిక రేట్లను చెక్ చేయడం మంచిది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: