భారతీయ రైల్వేలు త్వరలో అమలులోకి రానున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఖర్చులను తగ్గించే వ్యూహాత్మక చర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా నిర్వహణ, కొనుగోలు, ఎనర్జీ రంగాల్లో ఖర్చులను తగ్గించే ప్లాన్‌పై దృష్టి పెట్టింది.
ఈ సంవత్సరం జనవరిలో ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం 18 నెలల్లో తన నివేదికను సమర్పించనున్నట్లు అంచనా. నివేదిక అమల్లోకి వచ్చిన తర్వాత రైల్వే ఉద్యోగుల వేతనాలు మరియు బకాయిలు భారీగా పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.
2016లో అమలైన 7వ వేతన సంఘం వల్ల రైల్వే ఉద్యోగుల వేతనాలు 14% నుండి 26% వరకు పెరిగాయి. అప్పట్లో జీతాలు, పెన్షన్ల రూపంలో రైల్వేకి రూ.22,000 కోట్లు అదనపు భారమైంది. ఈసారి అది సుమారు ₹30,000 కోట్లు వరకు వెళ్లొచ్చని అంచనా.
Read also: Actress Vahini: క్యాన్సర్ తో బాధపడుతున్న నటి వాహిని
మరోవైపు, రైల్వే నెట్‌వర్క్ పూర్తిగా విద్యుదీకరణ కావడంతో ప్రతి (8th Pay Commission) సంవత్సరం ₹5,000 కోట్లు ఎనర్జీ ఖర్చు తగ్గుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. అదనంగా, ఇటీవల మూలధన వ్యయాలు (Capex) ప్రభుత్వ బడ్జెట్ మద్దతుతోనే జరిగిపోవడంతో, 2027-28 ఆర్థిక సంవత్సరంలో IRFC చెల్లింపులు తగ్గే అవకాశం ఉంది.
7వ పే కమిషన్ కనీస బేసిక్ పేను ₹7,000 నుండి ₹17,990కి పెంచింది. ఈసారి యూనియన్లు 2.86 ఫిట్‌మెంట్ ఫాక్టర్ కోరుతున్నాయి. ఇది అమల్లోకి వస్తే రైల్వే వేతన వ్యయం మరో 22% వరకు పెరగొచ్చు.
రైల్వేలు FY26లో ఉద్యోగులపై ₹1.28 లక్షల కోట్లు, పెన్షన్లపై ₹68,602 కోట్లు వెచ్చించనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: