తిరుమల (Tirumala) భక్తజనంతో కిటకిటలాడుతోంది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా ఆదివారం కావడంతో తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ మరింత పెరిగింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు.
Read Also: AP: నేటి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

ప్రత్యేక ఏర్పాట్లు
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో భక్తుల క్యూ లైన్లు కాంప్లెక్స్ బయట వరకు విస్తరించాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు బారులు తీరి స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: