
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ’ (Ustaad Bhagat Singh). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. చాలా రోజులుగా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఫుల్ మీల్స్ ఇచ్చే పాట వచ్చేసింది. తాజాగా ‘దేఖ్లేంగే సాలా’ అనే సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు.
Read Also: Bigg Boss 9: ఈ వారం డబుల్ ఎలిమినేషన్?
స్టైలిష్ డ్యాన్స్‌ను మరోసారి సిల్వర్
దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను భాస్కర బట్ల రాయగా.. విశాల్ దడ్‌లానీ పాడాడు. ”రంపంపం రంపంపం.. స్టెప్పేస్తే భూకంపం.. దేఖ్‌లేంగే సాలా.. చూసినాము చాలా” అంటూ సాగిన ఉస్తాద్ సాంగ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇందులో శ్రీలీలతో కలిసి పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పటిలాగే మంచి డ్యాన్స్ నంబర్ కంపోజ్ చేశారు. దినేష్ మాస్టర్ పవన్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కొరియోగ్రఫీ చేశారు.ఈ చిత్రాన్ని (Ustaad Bhagat Singh)మార్చి 26న 2026కు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: