Dhanu Rasi Today: డిసెంబర్ 16 నుంచి జనవరి 15 వరకు ధనూ రాశి(Sagittarius)లో జరుగుతున్న గ్రహాల సంయోగాలు విశేషమైన శక్తిని అందించనున్నాయి. ఈ కాలంలో గ్రహాల యుతులు, పరస్పర దృష్టులు కలిసి బలమైన ప్రభావాన్ని చూపించబోతున్నాయి. ముఖ్యంగా రవి–కుజుల కలయిక ఏర్పడగా, దీనిపై గురు, శనులు అనుకూలంగా దృష్టి సారించనున్నాయి. క్రమంగా ధనూ రాశిలో గ్రహాల సంఖ్య నాలుగుకు చేరి, మొత్తం మీద ఆరు గ్రహాల ప్రభావం పనిచేయడం వల్ల శుభఫలితాలు మరింత పెరుగుతాయి.
Read also : Kidney health :అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి? ఈ లక్షణాలను గుర్తించండి

ఈ ప్రత్యేక గ్రహస్థితుల ప్రభావంతో మేషం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాల్లో పురోగతి సాధించి, ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఉన్నత పదవులు, గౌరవం లభించడంతో పాటు చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. ఈ కాలం ఈ రాశుల వారికి అత్యంత శుభకరంగా మారనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :