हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Kollikapudi Srinivas: మరోసారి వార్తల్లో తిరువూరు ఎమ్మెల్యే 

Saritha
Kollikapudi Srinivas: మరోసారి వార్తల్లో తిరువూరు ఎమ్మెల్యే 

తిరువూరు టీడీపీ(TDP) ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్(Kollikapudi Srinivas) మరోసారి వివాదానికి కేంద్రబిందువుగా మారారు. తన సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు, వాట్సాప్ స్టేటస్‌లు పార్టీ అంతర్గత విభేదాలను ప్రజలకు తెలియజేస్తున్నాయి. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పై చేసిన ఆరోపణలు ఇంకా సరిగా చల్లారకముందే, కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదాస్పద అంశంతో ముందుకు వచ్చారు. తాజాగా, విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును టార్గెట్ చేస్తూ కొలికపూడి పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్‌కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే.. నువ్వు నిజంగా రాయల్ అంటూ ఆయన తన స్టేటస్‌లో ఘాటుగా విమర్శించారు. సుబ్బారావు, ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి చెందినవారిగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, కొలికపూడి ఈ వ్యాఖ్యలు చేసేవిధం చూస్తుంటే, ఆయన వ్యక్తిగతంగా వారిని లక్ష్యంగా చేసుకుని విమర్శలతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

Read also: Bhupalapally Crime: భార్యను ఉరి వేసి హత్య చేసిన భర్త.. అనంతరం ఆత్మహత్య

Kollikapudi Srinivas
Kollikapudi Srinivas The Tiruvuru MLA is in the news once again.

కొత్త వివాదంపై టీడీపీ రియాక్షన్ ఏంటి?

గతంలో(Kollikapudi Srinivas) ఎంపీ కేశినేని చిన్ని పై కూడా కొలికపూడి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనకు ఎమ్మెల్యే టికెట్ అందించేందుకు చిన్ని డబ్బులు డిమాండ్ చేశాడని, మాఫియా కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించి, పార్టీ క్రమశిక్షణా సంఘం విచారణ ప్రారంభించింది. కొలికపూడి ఈ కమిటీ ముందు వివరణ ఇచ్చినా, ఇంకా ఈ విచారణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ పాత వివాదంపై ఇంకా నిర్ణయం తీసుకోకముందే, కొలికపూడి మరోసారి పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం, టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త వివాదంపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. కొలికపూడి ఇలాంటి వివాదాలు మళ్లీ తెరపై తెస్తే, పార్టీలో మరింత ఘర్షణలు ఏర్పడే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870