हिन्दी | Epaper
మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి

A Mother’s Victory : ఓ అమ్మ విజయం

Abhinav
A Mother’s Victory : ఓ అమ్మ విజయం

మా ధవ్ చేయి పట్టుకుని కోటి ఆశలతో కాకపోయినా గుండె నిండా కొత్త జీవితంపై మధురమైన ఊహలతో ‘అతనింట్లో కృష్ణవేణి కుడికాలు మోపింది. స్వాగతించి హారతిచ్చేందుకు అక్కడ ఎవరూ లేరు. అయినా ఇక నుండి తను ఉండబోయే పొదరిల్లు ఇదే అని చుట్టూ పరికించి చూసింది. ఇంట్లో ఇల్లాలు లేని ఇల్లు ఎలా ఉంటుందో ఆ ఇల్లు అలాగే ఉంది. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ లేదు. మరీ చిందరవందరగా లేకపోయినా అస్తవ్యస్థంగానే ఉంది. నాలుగు రూములు, ముందు హాలు, బయట ఖాళీ జాగా. ఏదీ కృష్ణవేణికి క్రమపద్ధతిలో అగుపించడం లేదు. ఎప్పుడెప్పుడు నడుం బిగించి రంగంలోకి దిగుదామా అని ఆలోచిస్తోంది. అది పసిగట్టిన మాధవ్ హాలులో సోఫా చూపించి “కాసేపు ఇక్కడ కూర్చో, ఇప్పుడే వస్తాను” అంటూ బెడ్రూమ్లోకి వెళ్లాడు. అతడెందుకు వెళ్లాడో కృష్ణవేణికి అర్థమయింది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధపడినా ఎందుకో చెమటలు పట్టాయి. చేతిలోని కర్చీఫ్ తుడుచుకుంటుండగా మువ్వల శబ్దం వినిపించి అటు చూసింది. మాధవ్ చేయి పట్టుకని పది సంవత్సరాల పాప చేతిలో ఒక గులాబీతో నడిచి వచ్చింది. పింక్ కలర్ గౌను వేనుప” బొద్దుగా, ముద్దుగా అచ్చు మాధవ్ పోలికలతో, వేసుకున్న గౌను రంగుతో పోటీ పడుతున్న మేని రంగుతో చాలా అందంగా ఉంది పాప. వత్తుగా ఉంగరాల జుట్టు ముఖం మీద పడుతుంటే మరో చేత్తో వెనక్కి తోసుకుంటూ చేతిలో గులాబి కృష్ణవేణి చేతికిచ్చి “హలో” అంది.  కృష్ణవేణి “థాంక్స్ పాపా అంటూ పాపను దగ్గరకు తీసుకోవడానికి చేతులు దాపబోయింది.

అది గమనించిన పావ దూరం జరిగి తండ్రి కాళ్లను చుట్టుకుంది. కాస్త బాధనిపించినా కొత్త కదా! అని మనసుకి సర్దిచెప్పుకుని “నీ పేరేంటమ్మా?” అని దగ్గరకు వెళ్లింది. పాప సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా రూములోకి వెళ్లిపోయింది. “పాప పేరు హాసిని, ముద్దుగా పింకీ అని పిలుస్తాం. నువ్వు బాధపడకు. అలవాటయ్యేదాకా నీకు కష్టంగా అనిపిస్తుంది. అయినా నా కోసం భరించక తప్పదు. కృష్ణా” అన్నాడు. మాధవ్. “ఇదంతా నాకు తెలియదా? మీరు మనసు పాడు చేసుకోవద్దు” అని కృష్ణవేణి వంటింటి వైపు నడిచింది. “నువ్వు హైరానాపడి వంట చేయవద్దు. ఈరోజు బయట నుండి తెస్తాను” అన్నాడు. వంటింటి పరిస్థితి చూసాక అదే కరెక్టనిపించి “సరేనని” సర్దే పనిలో పడింది కృష్ణవేణి. రోజులు గడస్తున్నాయి. కృష్ణవేణి ఎంత ప్రయత్నించినా పింకీ చేరువ కావడంలేదు. అంతా మాధవ్ గమనిస్తూనే వున్నాడు. ఒకటి రెండు సార్లు పింకీకి సర్దిచెప్పబోతున్న మాధవ్న కృష్ణవేణి వారించింది. “మీరు అలా చేయడం వల్ల నన్ను వెనకేసుకు వస్తున్నారని నా పట్ల మరింత అయిష్టం పెంచుకుంటుంది. తన స్థానంలో ఉండి ఆలోచించండి. ఇప్పటివరకు తన ప్రపంచంలో మీరు మాత్రమే ఉన్నారు. మిమ్మల్ని నేను నా వైపుకి తిప్పుకుంటున్నాను.. అనే భావన తనలో ఉండి ఉంటుంది. నన్ను అమ్మగా అంగీకరించే క్షణం వరకు తను అలాగే ఉంటుంది. నేను అప్పటివరకు వెయిట్ చేస్తాను. మీరు నన్ను అపార్థం చేసుకోకుండా సహకరించండి చాలు.. ఈ విషయం పూర్తిగా నాకు వదిలెయ్యండి” అని చెప్పింది కృష్ణవేణి.

“థాంక్స్ కృష్ణా. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిని ఇక్కడకు వచ్చావు. నీకు ప్రశాంతతను ఇవ్వకపోగా మనను నొచ్చుకుని పారిపోయే పరిస్థితులు ఏర్పడకూడదనే నా భయం. అందుకే ఇంత సమయం తీసుకున్నాను, నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించడానికి”, “మీరు అలా మాట్లాడవద్దు. ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్నదాన్ని, అన్నీ ఆలోచించుకున్నాకే మనం ఒకటయ్యాం. ఒక నిజం చెప్పనా? నాకు మీ భార్యగా కన్నా పింకితో అమ్మా అని పిలుపించుకోవడంలోనే ఎక్కువ ఆనందం ఉందనిపిస్తుంది..” నవ్వేసింది కృష్ణవేణి. ఆ నవ్వులో ఆమె మంచితనం స్పష్టంగా గోచరించింది అతనికి. వారిరువురి కళ్లముందు గతం కదలాడింది. కృష్ణవేణి తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి చిరుద్యోగి, భార్య పోయాక మళ్లీ వివాహం చేసుకోకుండా. అల్లారుముద్దుగా ఉన్న దాంట్లోనే లోటు లేకుండా కూతురిని పెంచుకున్నాడు. కృష్ణవేణి డిగ్రీ పూర్తవగానే ఒకరోజు పెళ్లి సంబంధం తీసుకువచ్చాడు ఒక దూరపు బంధువు. “అబ్బాయి వ్యాపారం చేస్తున్నాడు. అబ్బాయి తరువాత ఒక ఆడపిల్ల ఉంది. పెళ్లయిపోయింది. డబ్బుకి లోటులేదు. అత్తమామలు మంచివారు. ఇంతకన్నా కావలసింది ఏముంది? అబ్బాయి ఫొటో తెచ్చాను. మీకు నచ్చితే ముందుకు వెళ్లాం” అన్నాడు. ఇదంతా కృష్ణవేణికి, ఆమె తండ్రికి ఎంతో ఆనందంగా, ఎదురు చూడని పెన్నిధిలా అనిపించింది. అబ్బాయి తండ్రి న్యాయవాది. తల్లి ఇంటిపనులు చూసుకునే గృహిణి, మంచి కుటుంబం. అబ్బాయి బాగానే ఉన్నాడు. బరువు బాధ్యతలు లేవు. 

అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేకపోవడంతో కృష్ణవేణి తండ్రి “అమ్మా! నువ్వేమంటావు?” అన్నాడు కూతురితో. ఆమె నవ్వుతూ తన అంగీకారం తెలిపింది. అంతకన్నా ఆలోచించే వయసు ఆమెకు లేదు. కృష్ణవేణి పెళ్లితంతు ముగిసి ఆనందంగా అత్తగారింట్లోకి అడుగు పెట్టింది. పెద్ద కుటుంబంలోకి వచ్చానన్న ఆనందం ఆమెను నిలువనీయడం లేదు. వైవాహిక జీవితం గురించిన ఆమె కలలు మొదటి రాత్రే కల్లలయ్యాయి, శోభనం పెళ్లికూతురు మధురమైన ఊహలతో బెడ్రూంలో భర్త రాకకై ఎదురు చూస్తూనే నిద్రపోయింది. అర్థరాత్రివేళ తప్పతాగి మాట్లాడే పరిస్థితిలో కూడా లేని రాజేన్ని చూసి కృష్ణవేణి నిర్ఘాంతపోయింది. మర్నాడు అత్తమామలు “అన్నీ సర్దుకుంటాయి, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. కంగారు పడకు” అని ధైర్యం చెప్పారు. కానీ అది జరగలేదు. రాజేష్ కృష్ణవేణితో ప్రత్యేకించి మాట్లాడడు. రోజూ తాగి రావడం, పలకరిస్తే తిట్టడం, అదేమిటని నిలదీస్తే కొట్టడం. వారాలు, నెలలు గడుస్తున్నా ఈ పరిస్థితిలో మార్పు లేదు. చిన్న వయసు, ఎన్నో బాధలు, ఏదైనా చెప్పుకుందామన్నా అమ్మలేదు. తోడబుట్టినవాళ్లు లేరు. పోనీ నాన్నకు చెప్పుకుందామా అంటే అప్పటికే ఆయన అనారోగ్యం బారిన పడ్డాడు. మరికొన్ని నెలలలో మరణించాడు. ఈ పరిస్థితిల్లోనే కృష్ణవేణికి ఆడపిల్ల పుట్టి పురిటిలోనే చనిపోయింది. కాలక్రమేణా “అత్తమామలు స్వతహాగా మంచివారే. అయినా కొడుక్కి చదువు ఒంటబట్టకపోవడం, చెడు సహవాసాలు, సకల దురలవాట్లు ఉండడంతో వివాహం చేస్తే మార్పు వస్తుంది ఈ పెళ్లి చేసారు” అని ఆలస్యంగా తెలుసుకుంది. 

రాను రాను రాజేష్ బిజినెస్ పనులు, టూర్లు అంటూ ఇంటికి రావడం తగ్గించేసాడు. మానసికంగా ఆమె మరింత కుంగిపోతోంది. ఆమె గుండెకోత అక్కడితో ఆగలేదు. తాగిన మైకంలో డ్రైవ్ చేస్తున్న రాజేష్కి యాక్సిడెంట్ అయి అక్కడికక్కడే మరణించాడు. ఆమెను చూసి అత్తమామలు పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. ఆడపడుచు నిశ్చల చదువుతో పాటు ఆధునిక భావాలున్న యువతి. ఇంచుమించుగా కృష్ణవేణి తోటిదే. వదినకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకుంది. “ఆలోచనలు మాని చదువుకో వదినా” అంటూ దూరవిద్యలో పేజికి కట్టించింది. ముందుగా “వద్దు” అని తిరస్కరించిన కృష్ణవేణిని అత్తమానులు కూడా ప్రోత్సహించారు. అప్పుడు చదువు పట్ల ఆసక్తిని పునరుద్ధరించుకుంది కృష్ణవేణి.. నిశ్చల ఉదయం ఇంగ్లీషు క్లాసులకు, సాయంత్రం కంప్యూటర్ కోర్సులో శిక్షణకు కృష్ణవేణిని పంపించింది. క్లాసులకు వెళుతూ ప్రపంచాన్ని చూస్తున్న ఆమెలో ఆత్మవిశ్వాసం హెచ్చింది. మాధవ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ యజమాని నిశ్చల కూడా అక్కడే నేర్చుకోవడంతో కృష్ణవేణిని అక్కడే చేర్చింది. మాధవ్ మంచివాడు. సంస్కారం కలిగిన వ్యక్తి. కృష్ణవేణి పరిస్థితులు నిశ్చల ద్వారా తెలుసుకుని ఆమెను ప్రోత్సహించేవాడు. మంచి మాటలు చెప్పి ధైర్యం కలిగించేవాడు. ఆడపిల్లకు చదువు, ఉద్యోగం ఉంటే మానసికమైన అండ ఉండి భవిష్యత్తు సుగమంగా ఉంటుంది అని ఉత్సాహపరిచేవాడు. క్రమంగా ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడింది. ఒకరి గురించి మరొకరికి అన్ని విషయాలు తెలిసాయి. పింకి చిన్న పిల్లప్పుడే మాధవ్ భార్య అనారోగ్యంతో కన్ను మూసింది. 

మరో వివాహం చేసుకుంటే వచ్చే అమ్మాయి పాపను ఎలా చూస్తుదోనని నిరాకరించాడు. ఆడప్లిల పెరుగుతుంటే తల్లి అవసరం ఎంత ఉంటుందో అర్థం చేసుకుంటు న్నాడేగానీ పెళ్లికి సుముఖత చూపలేదు. కృష్ణవేణి పరిచయం తరువాత అతనిలో పెళ్లిపట్ల మళ్లీ ఆలోచన చిగురించింది. పింకీకి తల్లిగా ఆమె న్యాయం చేయగలుగుతుందని అనిపించి నిశ్చలను సంప్రదించాడు. నిశ్చల “వదినా! సార్ నాతో మాట్లాడారు. నీకు కొత్త జీవితం ప్రారంభించే అవకాశం వచ్చింది. సర్ ఇంటికి ఇల్లాలిగా ఆహ్వానిస్తున్నారు. అమ్మా నాన్నలు కూడా నీ జీవితం ఇలా మారినందుకు వాళ్లే కారణమని బాధపడుతున్నారు. అదీగాక వాళ్లు తమ స్వంత ఊరికి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. సర్ లాంటి నుంచి వ్యక్తి తోడును కాదనవద్దు” అని కృష్ణవేణిని పెళ్లికి ఒప్పించింది. మాధవ్ స్నేహం పెళ్లి ప్రతిపాదనగా మారుతుందని కృష్ణవేణి ఊహించలేదు. ముందుగా షాకయినా పింకీకి తల్లిగా మాధవ్ జీవితంలోకి అడుగు పెట్టడానికి అంగీకరించింది. తల్లి లేని పిల్లగా తను పడిన ఇబ్బందులు తెలుసు కాబట్టి పింకీని అర్ధం చేసుకోవడం సానుకూలమవుతుందని ఆశించింది. “డాడీ… దాడీ…” అన్న పింకీ పిలుపుతో కృష్ణవేణి, మాధవ్లు ఇద్దరూ గత జ్ఞాపకాల వకాల నుండి తేరుకున్నారు. “ఈ జడ చూడండి.. ఎన్నిసార్లు వేసుకున్నా తిత్తులు తిత్తులుగా వస్తుంది” అని చేతిలో దువ్వెన మరో చేతిలో రిబ్బను పట్టుకుంది పింకీ. “పింకీ! నేను వేస్తానుండు” అని కృష్ణవేణి దగ్గరకు వెళ్లింది. “డాడీ! మీరు వేయండి నాకు స్కూలుకు టైమవుతోంది” అని తండ్రి దగ్గరకు వెళ్లింది పింకీ.

“అమ్మ వేస్తానంటోందిగా, వెళ్లు తల్లి” అన్నాడు మాధవ్. “వద్దు” పెడసరంగా సమాధానమిచ్చింది. “పింకీ” అంటున్న మాధవ్ వంక వారించినట్లుగా చూసింది కృష్ణవేణి. మాధవ్ మాట్లాడకుండా పింకీకి జడ వేసాడు. రోజలు అదే విధంగా గడుస్తున్నాయి. మాధవ్ పని మీద నాలుగు రోజులు. ఊరు వెళ్లవలసి వచ్చింది. అప్పుడు పింకీకి వేసవి సెలవులు కావడం వల్ల ఇంటి పట్టునే ఉంది. ఆ సమయాన్ని పింకీతో సాన్నిహిత్యం పెంచుకునేందుకు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణవేణి ఉవ్విళ్లూరింది. “పింకీ! అన్నం తిందాం రామ్మా” అని పిలిచేది. “నాకు ఆకలిగా లేదు” చెప్పి అక్కడినుండి వెళ్లిపోయేది పింకీ. తనకోసం ఎంతసేపు ఎదురు చూసినా వచ్చేది కాదు. తన రూములోకెళ్లి పడుకోగానే పింకీ బయటకు వచ్చి అన్నం పెట్టుకుని తినేది. “నీకు ఏ కూరంటే ఇష్టం? ఏం వండమంటావు పింకీ?” అనేది కృష్ణవేణి. “ఏది వండినా సరే” అనేది పింకీ. “సినిమాకు వెళ్లామా?” “నేను రాను, బొమ్మలు వేసుకోవాలి” అనేది తల ఎత్తకుండానే. “ఏదయినా పార్కుకి వెళ్లి సరదాగా తిరిగివద్దామా పింకీ!” “డాడీ వచ్చాక వెళ్లాం” టీవీపై నుండి దృష్టి మరల్చకుండానే అనేది. పింకీ ప్రతి రెండు గంటలకొకసారి వాళ్ల డాడీకి ఫోన్ చేసి “డాడీ! ఎప్పుడు వస్తున్నారు? నాకు బోర్గా ఉంది. త్వరగా రండి. నేను ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను” అని కంప్లెయింట్ చేసేది. ఇదంతా చూస్తున్న కృష్ణవేణి మనసు చివుక్కుమనేది. ఒక్కోసారి విసుగ్గా కూడా అనిపించేది. కావాలని ఏదో ఒకటి కల్పించుకుని మాటలు కలిపినా “వద్దు, తెలియదు, అలాగే” అనే మాటలు తప్ప పింకీ నుండి వేరే సమాధానాలు వచ్చేవి కావు. రోజులు అలాగే గడుస్తున్నాయి.

మాధవ్ నిస్సహాయంగా ఇద్దరినీ చూస్తుండేవాడు. ఆ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో చెప్పడం కష్టం. ఒకసారి పింకీకి పరీక్షల సమయం. తనకి తెలుగు సరిగ్గా రాదు. తన చౌట్స్ అన్నీ ఎప్పుడూ మాధవ్ క్లియర్ చేస్తుంటాడు. ఆ రోజు మాధవ్కి ఇంట్లో వుండి చదువు చెప్పడం కదురక “అమ్మతో చెప్పించుకొమ్మని” చెప్పి వెళ్లాడు. పింకీ కృష్ణవేణిని అడగలేదు. మాధవ్ కృష్ణవేణికి ఫోన్ చేసి “పింకీ అడగకపోయినా తెలుగుపాఠాలు చదివించు. రేపు తెలుగుపరీక్ష” అని చెప్పాడు. పింకీ ఎలా స్పందిస్తుందో తెలిసినా దగ్గరకు వెళ్లింది కృష్ణవేణి. తెలుగు పుస్తకం చేతిలో పట్టుకుని దిగులుగా కూర్చుంది పింకీ. “డాడీ నీకు తెలుగు చెప్పమన్నారమ్మా” అంటూ కృష్ణవేణి పుస్తకం తన చేతుల్లోకి తీసుకుంది. “నాకు నువ్వేం చెప్పనక్కర్లేదు” అంటూ పుస్తకం లాగేసుకుంది. కృష్ణవేణికి బాధ, చిరాకు రెండూ కలిగాయి. “పింకీ! నన్ను అమ్మలా అనుకోవద్దు. ఒక ట్యూషన్ టీచర్లా భావించి పాఠాలు చెప్పించుకో. అనవసరమైన పంతంతో సమయం వృథా చేసుకోవద్దు. నీకు మార్కులు తక్కువ వస్తే నీ కన్నా నేనే ఎక్కువ బాధపడతాను” అంటూ లేచి వెళ్లపోబోయింది. పింకీ ఏమనుకుందో..! లేచి వచ్చి పుస్తకం చేతికి ఇచ్చింది. మొహమాటపడుతూనే నెమ్మదిగా తన సందేహాలన్నీ అడిగి తెలుసుకుంది. ఆ తరువాత పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి. కృష్ణవేణి చాలా సంతోషించింది. కానీ పింకీ నుండి ‘థాంక్స్’ అన్న చిన్న మాట కూడా లేకపోవడంతో తెలియకుండానే బాధ కలిగింది. పింకీ పుట్టినరోజు వచ్చింది. తన స్నేహితులందరినీ ఇంటికి ఆహ్వానించింది. 

మాధవ్ కేక్, చిప్స్, కూల్ డ్రింక్స్ తీసుకువచ్చాడు. కృష్ణవేణి బిర్యానీ, రెండు మూడు రకాల కూరలు, స్వీట్లు తయారు చేసింది. ఇద్దరూ కలసి ఇల్లంతా చాలా అందంగా అలంకరించారు. కృష్ణవేణి పింకీని పుత్తడిబొమ్మలా ముస్తాబు చేసింది. మాధవ్ ఇదంతా చూసి చాలా ఆనందించాడు. పిల్లలందరి మధ్యన సరదాగా కేక్ కటింగ్ అయిపోయింది. ఉత్సాహంగా పిల్లలకు భోజనాలు వడ్డించింది కృష్ణవేణి. మాధవ్ కూడా సహాయం చేశాడు. పిల్లలు పింకీతో “మీ మమ్మీ వంటలు చాలా బాగా చేసారు. బిర్యానీ చాలా బాగుంది” అన్నారు. పింకీ సమాధానం కోసం కృష్ణవేణి చెవులు రిక్కించింది. “తను మా మమ్మీ కాదు” పింకీ కొట్టినట్లుగా అంది. “మరి ఎవరు?” ఒక పాప అడిగింది. పింకీ కళ్లెత్తి మాధవ్ వంక చూసి తల దించుకుంది. అవమాన భారంతో మాధవ్ తల దించుకున్నాడు. కృష్ణవేణి అదేమీ విననట్లుగా మౌనంగా అక్కడి నుండి లోపలికి వెళ్లిపోయింది. వెనుకే వచ్చి సర్దిచెప్పబోయిన మాధవ్తో “చిన్న పిల్ల కదా! తనే అర్థం చేసుకుంటుంది, నేను బాధపడను. మీరు మామూలుగా ఉండండి” అని కృష్ణవేణి కాస్త తేరుకున్నాక నచ్చచెప్పింది. రెండు రోజుల తరువాత రాత్రివేళ నిశ్చల నుండి మాధవ్కి ఫోన్ వచ్చింది “సర్! మేం అపార్ట్మెంట్ కొనుక్కున్నాం. వచ్చే సోమవారం గృహప్రవేశం. మీరు, వదిన, పాపతో కలసి తప్పకుండా వరాలి. వదిన పెళ్లయి వెళ్లాక ఒక్కరోజు కూడా ఎక్కడికీ వెళ్లలేదు. మా ఇంట్లో రెండు రోజులు ఉంటుంది. ముందుగా పంపించండి” అని అంది. “తప్పకుండా వస్తామమ్మా! ఫోన్ మీ వదినకిస్తాను, మాట్లాడు” అని ఫోన్ కృష్ణవేణికి ఇచ్చాడు. 

“వదినా! ఎలా వున్నావు? ఫోన్లోనే తప్ప కలవడమే లేదు. రెండు రోజులు ముందుగా రావాల్సిందే!” అని గొడవ చేసింది నిశ్చల. “పింకీకి పరీక్షలు వస్తున్నాయి, నేను వచ్చి ఉండడం కుదరదు. ఆయన, పాప ఇబ్బంది పడతారు, ఫంక్షన్ రోజుకి ముగ్గురం వస్తాం” అంది కృష్ణవేణి. “వదినా! నువ్వు చెప్పినా వినవుగానీ ఉంటాను”అని ఫోన్ పెట్టేసింది. మాధవ్ నిద్రపోతున్న పింకీని చూస్తూ “నిన్ను అమ్మగా అంగీకరించలేని పిల్ల కోసం ఎంతగా తపన పడుతున్నావు కృష్ణా! పింకీకి ఎలా నచ్చచెప్పాలో నాకు తెలియదడం లేదు” అన్నాడు. “మీరు అలా అనకండి. నేను కూడా తల్లి లేకుండానే పెరిగాను. తన మనసులో వుండే అపోహలు తొలగించవలసిన బాధ్యత నా మీద ఉంది. మా నాన్న “నన్ను సరిగ్గా చూసే అమ్మాయి రాదేమోనని మరో వివాహం చేసుకోలేదు. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడంటే తమ స్థానానికి ముప్పు వాటిల్లుతుందని పసి హృదయాలు ఎలా. తల్లిడిల్లుతాయో నాకు తెలుసు. తోటి స్నేహితులు, ఇరుగు-పొరుగు మాటలు దానికి తోడవుతాయి. అందుకే పింకీ నా పట్ల అలా ప్రవర్తిస్తోంది. తను నన్ను అమ్మగా స్వీకరించేవరకు నిరీక్షిస్తాను. నాకు మాత్రం తనే కూతురు. అందుకే మనకు వేరే పిల్లలు వద్దని మీకు ముందే చెప్పాను. నా బంగారు తల్లికి నేనే అమ్మను. తనే నా కూతురు!” ఆపేక్షగా పింకీ తల నిమురుతూ అంది కృష్ణవేణి. “కృష్ణా! నీదెంత మంచి మనసు?” ఆమె చేయి మీద చేయి వేసాడు మాధవ్. పింకీ నిద్రలో మెలకువ వచ్చి జరిగిన సంభాషణ అంతా విన్నది. కళ్లు తెరచి కృష్ణవేణి ముఖం చూసింది. అందంగా నవ్వి లేచి వచ్చి కృష్ణవేణి ఒళ్లో తల పెట్టుకుని ఆమె చేయి తనపై వేసుకుంది. కృష్ణవేణికి “నీ ఓపిక ఫలించింది” అన్న ప్రశంస మాధవ్ కళ్లల్లో కనిపించింది. కొండంత భారం దిగిపోయింది అనే భావంతో ఊపిరి తీసుకున్నాడు మాధవ్. ఆశ నెరవేరిన సంతృప్తితో కృష్ణవేణి ముఖం వెలిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870