ప్రముఖ ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్‌కు మరోసారి తీవ్ర న్యాయపరమైన సమస్య ఎదురైంది. కంపెనీ(Pharma company) బేబీ పౌడర్ వాడటం వల్ల ఒవేరియన్ క్యాన్సర్ వ్యాధి బారిన పడిన రెండు మహిళల కేసులో, కాలిఫోర్నియా జ్యూరీ వారి తీర్పు వెలువరించింది. జ్యూరీ, క్యాన్సర్ ముప్పును వినియోగదారులకు సరైన రీతిలో హెచ్చరించడంలో జాన్సన్ అండ్ జాన్సన్(Johnson & Johnson) విఫలమైందని తేల్చి, బాధితులకు 40 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించమని ఆదేశించింది. ఈ తీర్పు ప్రకారం, ఒక బాధితురాలికి 18 మిలియన్ డాలర్లు, మరొకరికి 22 మిలియన్ డాలర్లు పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించబడింది. బాధితులు తమ పిటిషన్‌లో, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌ను దశాబ్దాలుగా వాడుతున్నారని, అందులో ఉన్న ఆరోగ్య సంబంధిత ప్రమాదాలు గురించి వారికి తెలియదని ఆరోపించారు. జ్యూరీ వారు చేసిన వాదనలను అంగీకరించి ఈ తీర్పును ప్రకటించింది.
Read also : వీసా నిబంధనలు సడలింపు.. చైనీయుల కోసం గేట్లు తెరిచిన భారత్..

గతంలో వచ్చిన న్యాయపరమైన ఇబ్బందులు
జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ భద్రతపై గతంలో కూడా కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంది. ప్రపంచవ్యాప్తంగా(Pharma company)పలువురు వినియోగదారులు దీనిపై కేసులు దాఖలు చేసి, అనేక తీర్పులు కంపెనీకి ప్రతికూలంగా వచ్చాయి. ఈ తాజా తీర్పుతో జాన్సన్ అండ్ జాన్సన్ మరోసారి చట్టపరంగా చిక్కుల్లో పడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :