చిన్న సినిమాగా విడుదలై, థియేటర్లలో సంచలన విజయం సాధించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ హార్ట్ టచింగ్ మూవీని చూసిన చాలా మంది ప్రేక్షకులు, ముఖ్యంగా యువత, కన్నీళ్లతో బయటకు వచ్చారు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ రూరల్ లవ్ స్టోరీ రూ. 17 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ (OTT Movie) సంస్థ ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో, డిసెంబర్ 19 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Read Also: Akhanda 2 Day 1 Collections: అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?.

వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రేమకథ
తెలంగాణలోని ఖమ్మం జిల్లా (Khammam) ఇల్లెందులో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రంలో అఖిల్ రాజ్ మరియు తేజస్విని రావు హీరో, హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరికీ ఇదే మొదటి సినిమా అయినప్పటికీ, తమ అద్భుత నటనతో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించారు. ఈ సినిమాకు నవంబర్ 21న విడుదలైన మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది.
‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ పాత్రలో నటించి బాగా భయపెట్టారు, ఈ సినిమాలో అతని నటన హైలెట్ అని చెప్పుకోవచ్చు.
నిర్మాణం మరియు సాంకేతిక వివరాలు
ఈ సినిమాను డాక్టర్ నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి సంయుక్తంగా నిర్మించారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేశారు. శివాజీ రాజా, అనిత చౌదరి ప్రధాన పాత్రల్లో నటించగా, సురేష్ బొబ్బలి సంగీతం అందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: