India Blind Women Cricket Team: భారత్ మహిళల అంధుల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజేతలుగా నిలిచినందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వారిని ఘనంగా అభినందించారు. మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో జట్టు సభ్యులు, శిక్షకులు, సహాయక సిబ్బందితో సమావేశమై, వారి ప్రతిభను కొనియాడుతూ ప్రత్యేక సత్కారం అందజేశారు.
Read Also: Messi Statue: 70 ఫీట్ల ఎత్తైన మెస్సి విగ్రహం.. ఎక్కడంటే?




క్రీడాకారిణులందరికీ రూ.5 లక్షల
విజేత క్రీడాకారిణులందరికీ రూ.5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందజేసి, పట్టుచీరలు, శాలువాలు, జ్ఞాపికలు, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ వంటి బహుమతులు సమకూర్చారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) అంధ క్రికెటర్ల సాధన, కృషి దేశానికి గర్వకారణమని అభినందిస్తూ, ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కెప్టెన్ దీపిక మరియు క్రీడాకారిణి పాంగి కరుణకుమారి జట్టులో ఉండటం ప్రత్యేకంగా ప్రసంసనీయమని ఆయన తెలిపారు. స్థానిక ప్రాంతాల రహదారి సౌకర్యాలు, ఇతర అభ్యర్థనలపై అధికారులను వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: