భారతీయ వ్యాపార ప్రపంచంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ముఖ్యంగా రిలయన్స్ రిటైల్ (Reliance Retail) విభాగం ప్రస్తుతం ముఖేష్ అంబానీ కుమార్తె.. ఈషా(Isah) అంబానీ నాయకత్వంలో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఈ అతిపెద్ద రిటైల్ కంపెనీ ఐపీవో (Reliance Retail IPO) ద్వారా పబ్లిక్ లిస్టింగ్‌కు సిద్ధమవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్గతంగా తమ రిటైల్ వ్యాపారాన్ని 2028 నాటికి పబ్లిక్‌కు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీవో (Initial Public Offering) ద్వారా మార్కెట్‌లో లిస్టింగ్ అయ్యేందుకు వీలుగా ప్రస్తుతం కంపెనీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. మెగా ఐపీవో కోసం ముఖేష్ అంబానీ వ్యూహాలు పెద్ద ఐపీవోను తీసుకురావడానికి ముందు మార్కెట్‌లో అత్యధిక వాల్యుయేషన్ (విలువ) సాధించడమే రిలయన్స్ రిటైల్ లక్ష్యం. దీనికోసం ఈషా అంబానీ బృందం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
Read Also: Pakistan Boat: గుజరాత్ సముద్రంలో పాకిస్తాన్ బోటు కలకలం..

లక్ష్యంగా 2,000 కొత్త స్టోర్లను తెరవాలని..
గతంలో వేగంగా స్టోర్‌లను తెరిచి తర్వాత స్టోర్‌లను మూసివేసిన అనుభవం ఉంది. కాబట్టి ఇకపై లాభదాయకతపై దృష్టి సారించి ప్రతి సంవత్సరం సుమారు 2,000 కొత్త స్టోర్లను తెరవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణ చాలా ప్లాన్డ్‌గా ఉంటుంది. రుణ భారం తగ్గింపు (Debt Reduction): ఐపీవోకు సిద్ధమవుతున్నప్పుడు బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేయడం చాలా ముఖ్యం. అందులో భాగంగా, రిలయన్స్ రిటైల్ రుణాలను తిరిగి చెల్లించడం ప్రారంభించింది. గతేడాది రూ.53,546 కోట్లుగా ఉన్న నాన్-కరెంట్ రుణాలు FY25 నాటికి రూ.20,464 కోట్లకు తగ్గాయి. ముఖ్యంగా హోల్డింగ్ కంపెనీ నుండి తీసుకున్న ఇంటర్-కార్పొరేట్ డిపాజిట్లు (ICD) భారీగా తగ్గాయి. రిలయన్స్ రిటైల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ (Quick Commerce) విభాగంలో తన వాటాను పెంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ రోజుకు 1 మిలియన్ (10 లక్షలు) క్విక్ కామర్స్ లావాదేవీలను నమోదు చేస్తోంది. 90% ఆర్డర్‌లను 30 నిమిషాల కంటే తక్కువ సమయంలో డెలివరీ చేస్తోంది. దీనికోసం పెద్ద నగరాల్లోని స్మార్ట్ పాయింట్ గ్రోసరీ స్టోర్‌లను ‘డార్క్ స్టోర్స్’గా మారుస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: