Akhanda 2: నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను (Boyapati srinu) కాంబినేషన్ అంటే టాలీవుడ్లో ప్రత్యేక మాస్ క్రేజ్. ఈ ఇద్దరి సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఉత్సాహం అసలు తగ్గదు. అదే జోష్‌తో వచ్చిన అఖండ 2 తాండవం ప్రీమియర్స్ రోజే బాక్సాఫీస్‌ను కుదిపేసింది.
Read also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

Akhanda 2 shatters Nizam records
నైజాం ప్రీమియర్స్: టికెట్ రేట్లు భారీగా ఉన్నా ప్రేక్షకుల సందడి తగ్గలేదు
నైజాం ప్రాంతంలో ప్రీమియర్స్ టికెట్లు 600 రూపాయల దాకా ఉండటం చూసి కొందరు ఆశ్చర్యపోయినా, థియేటర్ల వద్ద అభిమానుల హడావిడి మాత్రం అద్భుతంగా కనిపించింది. అంచనాల ప్రకారం,
- నైజాం ప్రీమియర్ వసూళ్లు: రూ. 2.3 కోట్లు (అంచనా)
- ఏపీ + తెలంగాణ మొత్తం ప్రీమియర్ వసూళ్లు: రూ. 5 కోట్ల మార్క్ దాటే అవకాశం
అధికారిక ఫిగర్లు మాత్రం సినిమా యూనిట్ ప్రకటించిన తర్వాత తెలుస్తాయి.
అఖండ 2 – పాన్ ఇండియా స్థాయిలో మాస్ & డివోషనల్ మిక్స్
Akhanda 2: బాలకృష్ణ ఎనర్జీ, బోయపాటి స్టైల్ యాక్షన్, డివోషనల్ ఫీల్ all in one గా ఉండటం వల్ల అఖండ 2కి భారీ క్యూరియాసిటీ ఏర్పడింది. 3D వెర్షన్ కూడా రావడంతో యువ ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ పెరిగింది. సమ్యుక్త, ఆదీ పినిశెట్టి, పూర్ణ, కబీర్ దువాన్ సింగ్ వంటి నటులు కథకు బలాన్నిచ్చారు. థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం థియేటర్ వైబ్స్‌ను రెట్టింపు చేసింది.
మొదటి రోజు స్ట్రాంగ్ రెస్పాన్స్…
ప్రీమియర్స్‌లో బలమైన స్టార్ట్ దక్కడంతో, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: