
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారతదేశ పర్యటనలో భాగంగా (నేడు) శుక్రవారం కోల్‌కతా చేరుకోనున్నారు. ఈ సందర్భంగా, నగరంలోని లేక్ టౌన్ వద్ద సుమారు 70 అడుగుల ఎత్తైన మెస్సీ విగ్రహాన్ని (Messi Statue) ఆవిష్కరించనున్నారు. శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్ ఆ అర్జెంటీనా సూపర్‌స్టార్ విగ్రహాన్ని తయారు చేయించింది. మెస్సి విగ్రహం (Messi Statue) లో అతను ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని పట్టుకుని ఉన్నాడు.
Read Also: Karnataka: చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లకు ప్రభుత్వం అనుమతి
ఇనుముతో విగ్రహాన్ని రూపొందించారు
మాంటీ పౌల్స్ బృందం ఆ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. మెస్సీ కుటుంబసభ్యుల కటౌట్లు, స్టాచ్యూలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే ఇది అత్యంత ఎత్తైన మెస్సీ విగ్రహమని బెంగాల్ మంత్రి తెలిపారు. గోట్ టూరులో భాగంగా మెస్సీ ఇండియా వస్తున్నారు. కోల్‌కతాతో పాటు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో మెస్సీ టూరు చేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: