బాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘ధురంధర్’ (Dhurandhar Movie) సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు అగ్ర కథానాయకుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). తాజాగా ఈ సినిమాను వీక్షించిన బన్నీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. చిత్ర బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. సినిమా అద్భుతంగా ఉందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని అన్నారు.
Read Also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
“ఇప్పుడే ‘ధురంధర్’ సినిమా (Dhurandhar Movie) చూశాను. అత్యుత్తమ నటన, అద్భుతమైన సాంకేతికత, అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లతో కూడిన గొప్ప చిత్రం ఇది” అని అల్లు అర్జున్ తన పోస్టులో పేర్కొన్నారు. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “నా సోదరుడు రణ్‌వీర్ సింగ్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు. సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలిచాడు” అంటూ కితాబిచ్చారు.
నిర్మాతలకు శుభాకాంక్షలు
అలాగే అక్షయ్ ఖన్నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉందని, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలలో జీవించారని కొనియాడారు. హీరోయిన్ సారా అర్జున్ నటన కూడా ఆకట్టుకుందని తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్‌ను ‘కెప్టెన్’ అని సంబోధిస్తూ, ఎంతో పట్టుదలతో ఈ చిత్రాన్ని విజయవంతంగా రూపొందించారని అభినందించారు. చిత్ర బృందం, సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: