TG SIT: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు సిట్ (Special Investigation Team) ముందుకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ దర్యాప్తుకు హాజరైన ప్రభాకర్ రావు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణకు అనుమతించబడ్డారు. ఈ సమయంలో ఆయనకు భోజనం, మందులు తీసుకోవడానికి ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వబడ్డాయి.
Read also: Goa: ఎట్టకేలకు థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయిన లూథ్రా బ్రదర్స్

సుప్రీంకోర్టు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ చేసింది. కోర్టు ఆయనకు భౌతికంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కస్టోడియల్ దర్యాప్తు జరగాలని ఆదేశించింది. ఈ వారం రోజుల విచారణలో సిట్ ప్రత్యేక బృందం ఆయనతో వివరాలు సేకరిస్తుంది.
జస్టిస్ బీవీ నాగరత్న
కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ కోర్టు పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పించడం వల్ల దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించట్లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని దీనిపై మీరేమంటారని ప్రభాకర్‌రావు తరఫున న్యాయవాది రంజిత్ కుమార్‌ను ప్రశ్నించారు. పిటిషనర్ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్న పలు విషయాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అభిప్రాయం చెప్పేందుకు సమయం ఇవ్వాలని కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: