हिन्दी | Epaper
నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు

Telugu News: Draupadi murmur: శీతాకాల విడిది కోసం ముస్తాబవుతున్న రాష్ట్రపతి నిలయం

Sushmitha
Telugu News: Draupadi murmur: శీతాకాల విడిది కోసం ముస్తాబవుతున్న రాష్ట్రపతి నిలయం

దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 17న హైదరాబాద్‌కు (Hyderabad) రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె ఐదు రోజులపాటు బస చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. 17వ తేదీ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుంటారు. అనంతరం నగరంలోని పలు కార్యక్రమాలకు హాజరవుతారు. 21వ తేదీ మధ్యాహ్నం ఆమె తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. రాష్ట్రపతి నగరంతో పాటు ఇతర రాష్ట్రాలకు అధికార పర్యటనలకు ఇక్కడి నుంచే వెళ్తారు.

Read Also: CM Revanth: మెస్సీ ప్రోగ్రామ్‌తో ప్రభుత్వానికి సంబంధం లేదు

Draupadi murmur
Draupadi murmur The President’s residence is being prepared for winter quarters

రాష్ట్రపతి నిలయం చారిత్రక నేపథ్యం మరియు ప్రత్యేకత

దేశ మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ మొదలు నేటి ద్రౌపది ముర్ము వరకు అందరూ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస చేసినవారే. 1805లో బ్రిటీష్ పాలకులు నిర్మించిన ఈ భవనాన్ని అప్పట్లో వైస్రాయ్ అతిథి గృహంగా పిలిచేవారు. స్వాతంత్ర్యం అనంతరం 1950లో భారత ప్రభుత్వం దీనిని స్వాధీనం చేసుకుని రాష్ట్రపతి నిలయంగా మార్చింది. దక్షిణాది ప్రాంతంలో బొల్లారంలో మాత్రమే ఈ భవనం ఉండటం విశేషం. జూలై, ఆగస్టు నెలల్లో గానీ లేదా డిసెంబరు, జనవరి నెలల్లో రాష్ట్రపతులు ఇక్కడ పర్యటిస్తారు.

ఏర్పాట్లపై సమీక్ష మరియు అధికారుల సూచనలు

రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో అన్ని విభాగాలు రాష్ట్రపతి నిలయం సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. పోలీసు శాఖ భద్రత, ట్రాఫిక్, బందోబస్తును పకడ్బందీగా చేపట్టాలని, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్యం, విద్యుత్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రపతి నిలయం పరిసరాలలో కోతులు, తేనెటీగలు, పాముల బెడదను తగ్గించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ (GHMC), కంటోన్మెంట్ బోర్డులు పారిశుధ్యం మరియు ఇతర సదుపాయాలు కల్పించాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870